భారత టీ20 ప్రపంచకప్ 2026 విజేత జట్టుకు బీసీసీఐ రూ.131 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియాకు ఈ రివార్డును అందజేయనున్నారు. టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను రిటైన్ చేసుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ఐసీసీ ప్రైజ్‌మనీగా 27.48 కోట్లతో పాటు, ప్రతి మ్యాచ్ గెలిచినందుకు అదనపు బోనస్ లభించనుంది.