AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rice Prices: సామాన్యులకు మరో దెబ్బ.. భారీగా పెరిగిన బియ్యం ధరలు.. కొంపముంచిన ఎల్‌నీవో..

గత మూడు నెలలుగా బియ్యం ధరలు పెరిగి సామాన్యుడిపై పెనుభారం మోపుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం వల్ల వరి సాగు విస్తీర్ణం తగ్గి, దిగుబడి పడిపోవడం ప్రధాన కారణం. దీంతో డిమాండ్, సప్లైలో వ్యత్యాసం ఏర్పడి ధరలు పెరిగాయి. కొన్నిచోట్ల రైతులు అధిక ధర పొందుతున్నారు.

Rice Prices: సామాన్యులకు మరో దెబ్బ.. భారీగా పెరిగిన బియ్యం ధరలు.. కొంపముంచిన ఎల్‌నీవో..
Rice Prices
Venkatrao Lella
|

Updated on: Sep 28, 2026 | 9:45 PM

Share

సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఎల్‌నివో ప్రభావంతో వర్షాలు లేకపోవడం వల్ల రైతులు క్రాప్ హాలీడే ప్రకటిస్తున్నారు. పంటల సాగు భారీగా తగ్గిపోవడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు ఆమాంతం పెరుగుతున్నాయి. గత కొద్ది నెలలుగా నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కుతున్నాయి. పాలు, షుగర్, వంట నూనె, ఉల్లిపాయల వంటి నిత్యావసర సరుకుల ధరలు గత కొంతకాలంగా ఆకాశాన్నంటుతున్నాయి. అయితే వాటితో పాటు బియ్యం ధరలు కూడా పెరుగుతున్నాయి. గత మూడు నెలల వ్యవధిలో బియ్యం ధరలు గణనీయంగా పెరిగి సామాన్యుడిపై పెనుభారాన్ని మోపుతున్నాయి. కిలో బియ్యంపై  రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగింది.  ప్రస్తుతం  సన్నబియ్యం ధర కిలో రూ.70 పలుకుతుండగా.. నాణ్యమైన బియ్యం కోసం రూ.80పైగా చెల్లించాల్సి వస్తోంది.

ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు ధరల పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు. ఎల్‌నినో ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడులో వర్షాలు తక్కువగా పడతాయని వాతావరణశాఖ అధికారులు ముందే హెచ్చరించారు. ఫలితంగా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు మూడు లక్షల ఎకరాల మేరకు వరి సాగు విస్తీర్ణం తగ్గింది. తెలంగాణలోనూ సకాలంలో వర్షాలు లేకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్ల చాలామంది రైతులు వరి సాగుకు దూరమయ్యారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 40 శాతానికి పైగా పంటలు ఎండిపోయాయి. మహారాష్ట్రలో ఐదు లక్షల ఎకరాలకు పైగా వరి విస్తీర్ణం తగ్గింది. కావేరి బేసిన్లలో నీటి కొరత కారణంగా కర్ణాటకలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. తుంగభద్ర పరివాహక ప్రాంతంలో 60 శాతం వరి పండే ప్రాంతాల్లో నాట్లు వేయలేకపోయారు.

దేశవ్యాప్తంగా దాదాపు 397 జిల్లాల్లో వర్షాల కొరత కారణంగా ఖరీఫ్ సాగు తీవ్రంగా దెబ్బతింది. కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం.. బియ్యం ఉత్పత్తి ఐదు నుంచి ఏడు శాతం తగ్గింది. అంటే 12 మిలియన్ టన్నుల వరకు తగ్గవచ్చని అంచనా. దిగుబడి తగ్గడం వల్ల బియ్యం నిల్వలు తగ్గి మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుంచి తెలంగాణ బియ్యానికి డిమాండ్ పెరగడం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణంగా చెప్పవచ్చు. వ్యాపారులు పొలాల వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.  బియ్యం ఉత్పత్తి తగ్గుతుందని అంచనా వేసిన మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు ధాన్యాన్ని నిల్వ చేసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇది కృత్రిమ కొరతకు దారితీసి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. తెలంగాణలో బియ్యం సగటు రిటైల్ ధర కేజీ రూ.54 నుంచి ఆగస్టులో రూ.57కి చేరింది. ఈ నెల ఆరంభంలో రూ.63 దాటింది. ప్రస్తుతం సన్నబియ్యం రూ.70-రూ.80 పలుకుతోంది.

Follow Us
ఎల్‌నీవో ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బియ్యం ధరలు..
ఎల్‌నీవో ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బియ్యం ధరలు..
రైల్వే స్టేషన్‌లో నీళ్లు సురక్షితమేనా? బ్యాక్టీరియా పరీక్షల్లో ..
రైల్వే స్టేషన్‌లో నీళ్లు సురక్షితమేనా? బ్యాక్టీరియా పరీక్షల్లో ..
'విక్రమార్కుడు'లో రవితేజ డూప్‌గా చేసిన హీరో చనిపోయాడని తెలుసా?
'విక్రమార్కుడు'లో రవితేజ డూప్‌గా చేసిన హీరో చనిపోయాడని తెలుసా?
పుదీనా మొక్కను ఇలా నాటితే గుబురుగా పెరగడం పక్కా..
పుదీనా మొక్కను ఇలా నాటితే గుబురుగా పెరగడం పక్కా..
భోజనం చేసిన వెంటనే వేడి నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది?
భోజనం చేసిన వెంటనే వేడి నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది?
యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు ఈ విషయం మర్చిపోతే కోర్టు కేసులే..
యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు ఈ విషయం మర్చిపోతే కోర్టు కేసులే..
సొంత తమ్ముడినే అతి కిరాతకంగా హత్య చేయించిన అన్న.. ఎందుకంటే?
సొంత తమ్ముడినే అతి కిరాతకంగా హత్య చేయించిన అన్న.. ఎందుకంటే?
గ్రాండ్ గా వస్తున్న కార్తిక్ జయంతి రాయవలస..
గ్రాండ్ గా వస్తున్న కార్తిక్ జయంతి రాయవలస..
రుచికరమైన పట్టా గోబీ లచ్చాపరాఠా ఎప్పుడైనా తిన్నారా? భలే ఉంటుందిలే
రుచికరమైన పట్టా గోబీ లచ్చాపరాఠా ఎప్పుడైనా తిన్నారా? భలే ఉంటుందిలే
నాని ' ది ప్యారడైజ్' సినిమాలో ఆ స్టార్ నటుడి సీన్లు కట్ చేశారా?
నాని ' ది ప్యారడైజ్' సినిమాలో ఆ స్టార్ నటుడి సీన్లు కట్ చేశారా?