AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది.. ట్రెండింగ్‌ టాప్ ప్లేస్ లో రియల్ స్టోరీ

థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ చిత్రం, ఓటీటీలోకి రాగానే ఒక్కసారిగా హిట్టయింది. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ చిత్రం ట్రెండింగ్ లో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు జనాలు ఓటీటీలో రియల్ స్టోరీని తెగ చూసేస్తున్నారు.

OTT Movie: థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది.. ట్రెండింగ్‌ టాప్ ప్లేస్ లో రియల్ స్టోరీ
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 17, 2026 | 10:33 PM

Share

ఈ రోజుల్లో ఓటీటీ ప్రభావం బాగా పెరిగిపోయింది. అందుకే కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోయినా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం దుమ్మురేపుతున్నాయి. రికార్డు వ్యూయర్ షిప్ తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ‘భారత్ భాగ్య విధాత’ థియేటర్లలో పెద్దగా వసూళ్లు సాధించలేకపోయింది. అయితే ఓటీటీలో విడుదలైన వెంటనే ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ‘భారత్ భాగ్య విధాత’ చిత్రం 2026 జూన్ 14న థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. విమర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూలు అందుకున్నప్పటికీ, థియేటర్లలో ప్రేక్షకుల నుండి ఈ సినిాకు సానుకూల స్పందన లభించలేదు.భారతదేశంలో ఈ చిత్రం సుమారు రూ. 6.67 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 8.16 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

అయితే ఇప్పుడు ఓటీటీలో’భారత్ భాగ్య విధాత’ సినిమా ఇమేజ్ పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 14న జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు ఓటీటీలో విడుదలైన తర్వాత, ‘భారత్ భాగ్య విధాత’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, ట్రెండింగ్ జాబితాలో నంబర్ వన్‌కు చేరుకున్నట్లు చెబుతున్నారు. ‘భారత్ భాగ్య విధాత’ కథ 26/11 ముంబై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో రూపొందించారు.. సంక్షోభ సమయాల్లో ప్రభుత్వ ఆసుపత్రులలోని నర్సులు ప్రదర్శించే ధైర్యం, ముందుచూపును ఈ చిత్రం చాటిచెబుతుంది. ఒక ఉగ్రవాద దాడి మధ్యలో, పిల్లలతో సహా ఎంతోమంది రోగుల ప్రాణాలను కాపాడటానికి నర్సులు తమ ప్రాణాలను ఎలా పణంగా పెట్టారో ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇందులో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించారు. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో, ‘భారత్ భాగ్య విధాత’పై విస్తృత చర్చ జరుగుతోంది. తరచుగా, థియేటర్లలో ప్రేక్షకాదరణ పొందని చిత్రాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా మాత్రం సత్తా చాటుతుంటాయి. ప్రస్తుతం కంగనా చిత్రం విషయంలోనూ ఇలాగే జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా, ‘భారత్ భాగ్య విధాత’ తర్వాత కంగనా రనౌత్ ప్రాజెక్టులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొన్ని నివేదికల ప్రకారం ఆమె ‘సర్కిల్’, ‘క్వీన్ 2’ చిత్రాలలో నటించనుందని తెలుస్తోంది. ‘క్వీన్ 2’ అనేది 2014లో విజయవంతమైన ‘క్వీన్’ చిత్రానికి సీక్వెల్. త్వరలోనే వీటిపై అప్డేట్స్ రానున్నాయి.

భారత భాగ్య విధాత సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..
తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీఎం బంపర్ ఆఫర్..!
తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీఎం బంపర్ ఆఫర్..!