AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఈ సినిమా చూశాక బర్త్ డే చేసుకోవాలంటే భయపడిపోతారు.. ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీని చూశారా?

తన జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలతోనే డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. సరదాగా చేసుకునే ఓ బర్త్ డే పార్టీ శ్రుతి మించి ఓ మనిషి నిండు ప్రాణాన్ని ఎలా బలి తీసుకుందనే పాయింట్ తో ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

OTT Movie: ఈ సినిమా చూశాక బర్త్ డే చేసుకోవాలంటే భయపడిపోతారు.. ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీని చూశారా?
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 18, 2026 | 8:36 PM

Share

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆడియెన్స్ కూడా ఈ రియల్ స్టోరీలను చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీలకు భారీగా వ్యూయర్ షిప్ ఉంటోంది. అందుకే ఈ మధ్యన ఓటీటీలు కూడా ఎక్కువగా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలనే స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇదో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా దర్శకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు తన జీవితంలో జరిగిన ఒక యదార్థ సంఘటననే కథగా మలిచి ఈ మూవీని తెరకెక్కించాడు. ఒక బర్త్ డే పార్టీలో ఫ్రెండ్ షిప్ పేరుతో వేసిన వెకిలి వేషాలు ఓ మనిషి నిండు ప్రాణాలను ఎలా బలి తీసుకున్నాయి? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. థియేటర్లలో ఈ క్రైమ్ థ్రిల్లర్ పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం దుమ్మురేపింది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే ట్విస్టులు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. బాలు, అర్జున్, వెంకట్, సాయి, సత్తి క్లోజ్ ఫ్రెండ్స్ అమెరికాలో చదువుకుంటుంటారు. ఒకరోజు బాలు పుట్టినరోజు కావడంతో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అయితే ఈ సెలబ్రేషన్స్ శ్రుతి మించి అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంలో బాలు చనిపోతాడు. దీంతో తోటి ఫ్రెండ్స్ అందరూ భయపడిపోతారు. సాయం కోసం అర్జున్ సోదరుడు భరత్ ను పిలుస్తారు. లాయర్ అయిన ఇతడు.. చనిపోయిన బాలు తల్లిదండ్రులకు విషయం చెప్పి అమెరికా రప్పిస్తాడు. మరి ఇంతకీ బాలు చనిపోయాడా? లేదా చంపేశారా? చివరకు ఏమైందన్నదే ఈ సినిమా స్టోరీ.

ఆద్యంతం ఆసక్తికరమైన కథా కథనాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా పేరు బర్త్ డే బాయ్. విక్కీ దాసరి తెరకెక్కించిన ఈ సూపర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో రాజీవ్ కనకాల ప్ర‌మోదిని, వాకా మ‌ని, రాజా అశోక్‌, వెంక‌టేష్, సాయి అరుణ్‌, రాహుల్, సమీర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో అందుబాటులో ఉంది. మరి మీరు ఈ సినిమా చూశారా? ఒక వేళ చూడకపోతే ఇప్పుడే చూసేయండి. కచ్చితంగా మీకు ఓ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది. అలాగే ఈ మూవీ చూశాక బర్త్ డే పార్టీ చేసుకోవాలంటేనే భయపడతారు.

ది బర్త్ డే బాయ్ సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us