AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anarkali Chicken: ఎంతో జ్యూసీగా నోరూరించే అనార్కలి చికెన్ ఫ్రై.. పప్పుచారు, రసంలోకి తింటే అద్దిరిపోతుంది!

Anarkali Chicken Fry Recipe: రోజూ చేసుకునే సాధారణ చికెన్ వేపుడులా కాకుండా, ప్రత్యేకమైన పచ్చిమిర్చి-కసూరి మేతి పేస్ట్‌తో చేసే జ్యూసీ అనార్కలి చికెన్ ఫ్రై ఒక్కసారి ట్రై చేయండి. ముక్క గట్టిపడకుండా ఎంతో మృదువుగా, అదిరిపోయే రుచితో ఉండే ఈ స్పెషల్ నాన్‌వెజ్ స్టార్టర్ తయారీ విధానాన్ని ఇక్కడ సులభంగా తెలుసుకోండి.

Phani CH
|

Updated on: Aug 18, 2026 | 9:48 PM

Share
వీకెండ్ వచ్చిందంటే చాలు నాన్‌వెజ్ ప్రియుల ఇంట్లో చికెన్ ఘుమఘుమలు మొదలవుతాయి. అయితే ఎప్పుడూ ఒకే రకమైన చికెన్ ఫ్రై లేదా గ్రేవీ కర్రీలు తిని బోర్ కొట్టినప్పుడు, కాస్త భిన్నమైన మసాలాలతో కొత్తగా ట్రై చేస్తే భలే రుచిగా ఉంటుంది. హోటల్ స్టైల్‌లో ముక్క లోపలి వరకు జ్యూసీగా ఉంటూ, బయట చక్కటి రోస్ట్‌తో నోరూరించే 'అనార్కలి చికెన్ ఫ్రై' ఇంట్లోనే చాలా తేలికగా చేసుకోవచ్చు. పప్పుచారు లేదా టమాటా రసం అన్నంలోకి సైడ్ డిష్‌గా, అలాగే ఈవెనింగ్ స్నాక్‌గా అద్భుతంగా సరిపోయే ఈ స్పెషల్ చికెన్ రెసిపీ తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం.

1 / 5
కావలసిన పదార్థాలు: ఒక కేజీ చికెన్, రెండు పచ్చిమిర్చి, ఒక పెద్ద టేబుల్ స్పూన్ కసూరి మేతి, అంగుళం ముక్క అల్లం ముక్కలు, ఐదారు వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, రెండు స్పూన్లు ఉప్పు, ఒక స్పూన్ పసుపు, మూడు స్పూన్లు కాశ్మీరీ కారం, నిమ్మరసం, ఐదారు స్పూన్లు నూనె, రెండు లవంగాలు, దాల్చిన చెక్క, రెండు యాలకులు, ఒకటి నల్ల యాలకు, రెండు అనాస పువ్వు, బిర్యానీ ఆకులు, రెండు ఉల్లిపాయలు, మూడు రెమ్మలు కరివేపాకు, ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా మరియు ఒక స్పూన్  నెయ్యి.

2 / 5
తయారీ విధానం: ముందుగా ఒక చిన్న మిక్సీ జార్‌లో తుంచిన పచ్చిమిర్చి, కసూరి మేతి, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు మరియు కొద్దిగా కొత్తిమీర వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన కేజీ చికెన్‌లోకి సరిపడా ఉప్పు, పసుపు, కాశ్మీరీ కారం, మిక్సీ పట్టుకున్న గ్రీన్ పేస్ట్ మరియు ఒక చెక్క నిమ్మరసం పిండాలి. ఈ మసాలాలన్నీ ముక్కల లోపలికి ఇంకేలా బాగా కలిపి, కనీసం 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

3 / 5
స్టవ్ మీద పాన్ పెట్టి ఐదారు స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత లవంగాలు, చెక్క, యాలకులు, నల్ల యాలక్కాయ, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు వేసి వేపాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు రంగు మారాక కరివేపాకు వేసి వేగాక, మారినేట్ చేసిన చికెన్‌ను వేసి హై ఫ్లేమ్‌లో కలపాలి. చికెన్ నుంచి ఊరిన నీరంతా పూర్తిగా ఆవిరయ్యే వరకు వేయించాలి.

4 / 5
నీరు ఇంకిపోయాక కేవలం రెండు మూడు స్పూన్ల నీళ్లు చల్లి, మూతపెట్టి మీడియం మంటపై 10 నిమిషాలు ఉడికించాలి. చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత మూత తీసి హై ఫ్లేమ్‌లో పెట్టి ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. ముక్కలన్నీ మంచి గోల్డెన్ రోస్ట్ అయ్యాక తాజా కొత్తిమీర, ఒక స్పూన్ నెయ్యి మరియు కొద్దిగా నిమ్మరసం పిండి స్టవ్ ఆపేయాలి. అంతే, నోరూరించే జ్యూసీ అనార్కలి చికెన్ ఫ్రై సిద్ధం! వేడివేడిగా సర్వ్ చేసుకుని ఆస్వాదించండి.

5 / 5
Follow Us