వేలానికి అలెగ్జాండర్ కాలం నాటి వెండి నాణెం! 2,300 ఏళ్ల నిధి ఎవరికి సొంతం?
ప్రపంచాన్ని జయించిన గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ ద గ్రేట్ కాలానికి చెందిన అరుదైన వెండి నాణెం ఆస్ట్రేలియాలో అమ్మకానికి వచ్చింది. దాదాపు క్రీస్తు పూర్వం 323వ సంవత్సరం నాటి ఈ చారిత్రాత్మక నాణెం పురాతన నాణేలు సేకరించేవారిని, చరిత్రకారుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ప్రపంచాన్ని జయించిన గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ ద గ్రేట్ కాలానికి చెందిన అరుదైన వెండి నాణెం ఆస్ట్రేలియాలో అమ్మకానికి వచ్చింది. దాదాపు క్రీస్తు పూర్వం 323వ సంవత్సరం నాటి ఈ చారిత్రాత్మక నాణెం పురాతన నాణేలు సేకరించేవారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది.
నాణెం ప్రత్యేకతలు ఇవే!
25 మిల్లీమీటర్ల వెండి నాణేన్ని ‘బాబిలోన్’ ప్రాచీన నగరంలో ముద్రించారు. నాణేనికి ఒకవైపు పురాణాల్లోని గ్రీకు వీరుడు రాకిల్స్’ చిత్రం చెక్కబడి ఉంది. మరోవైపు చేతిలో డేగను పట్టుకుని కూర్చున్న గ్రీకు దేవతల రాజు ‘జ్యూస్’ రూపం ఉంది. నాణెంపై అలెగ్జాండర్ పేరును సూచించే గ్రీకు అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలెగ్జాండర్ మరణించిన సంవత్సరంలోనే ముద్రించిన ఈ నాణెం చారిత్రాత్మకంగా ఎంతో విలువైనదిగా భావిస్తున్నారు. ఆస్ట్రేలియాలో వేలానికి వచ్చిన ఈ అరుదైన నాణేన్ని సొంతం చేసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ వెండి నాణేలు నాటి కాలంలో అంతర్జాతీయ కరెన్సీగా చెల్లుబాటు అయ్యేవి. గ్రీస్, పర్షియా నుంచి భారతదేశ సరిహద్దుల వరకు విస్తరించిన ఆయన సువిశాల సామ్రాజ్యంలో ఇవే ప్రధాన ఆర్థిక మారకద్రవ్యంగా పనిచేసేవి.
న్యూయార్క్‌లోని ‘ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్’ కథనం ప్రకారం.. అలెగ్జాండర్ తాను వీరుడైన హెరాకిల్స్ వంశస్థుడని చెప్పుకునేవాడు. అలాగే నాణెంపై ఉన్న జ్యూస్ దేవుడు గ్రీకు ప్రపంచంలో సర్వసమానమైన అధికారానికి ప్రతీక. క్రీస్తు పూర్వం 323లో అలెగ్జాండర్ మరణించిన తర్వాత కూడా ప్రభుత్వం ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి ఆయన రూపంతోనే నాణేల ముద్రణను కొనసాగించింది.
ఈ నాణేనికి అంత డిమాండ్ ఎందుకు?
హెల్లెనిస్టిక్ కాలం ప్రారంభంలో రూపొందించిన ఈ నాణేలకు ప్రపంచవ్యాప్తంగా మ్యూజియంలు, పురాతన వస్తువులు సేకరించే వారిలో విపరీతమైన డిమాండ్ ఉంది. అద్భుత కళానైపుణ్యం ఈ నాణేల సొంతం. అలెగ్జాండర్ దండయాత్రల సమయంలో ‘బాబిలోన్’ నాణేల ముద్రణా కేంద్రం అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. నాటి కాలంలో సైనికులకు జీతాలు చెల్లించడానికి, ఖండాంతర వ్యాపారాన్ని నిర్వహించడానికి, ఇతర రాజ్యాలతో మైత్రి ఒప్పందాలు చేసుకోవడానికి ఈ వెండి నాణేలనే విస్తృతంగా ఉపయోగించేవారు.
ప్రపంచ చరిత్రలో కొద్ది మందిని మాత్రమే ‘‘గ్రేట్ రాజులు’’గా చెబుతారు. వారిలో నెంబర్ వన్ అలెగ్జాండర్ ది గ్రేట్. క్రీస్తుపూర్వం 323-36 వరకు ఆయన పాలన కొనసాగింది. ప్రపంచాన్ని జయించాలనే కాంక్షతో చాలా రాజ్యాలను గెలుచుకున్నాడు. అలెగ్జాండర్ మెసిడోనియా మాత్రమే రాజు కాదు. ప్రపంచాన్ని గెలిచిన వీరుడు. గ్రీస్ నుంచి భారతదేశం వరకు తన ఇలాకాను విస్తరించాడు. అతడి సైనిక బలగాలు, యుద్ధ వ్యూహాలను ఇప్పటికీ ఆధునిక ప్రపంచ దేశాల సైనిక నిపుణులు అధ్యయనం చేస్తున్నారు.