AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంతకు తెగించావు రా! మాజీ ప్రియురాలి హత్యకు ప్లాన్ చేసిన యువకుడిని పట్టించిన ‘చాట్‌జీపీటీ’!

నేరాలలో చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ వాడకం పెరగడం ఇటీవల ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 25 ఏళ్ల యువకుడు మాజీ ప్రేయసిని దారుణంగా హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. ప్లాన్‌కు సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని ‘చాట్‌జీపీటీ’ తో చర్చించాడు.

ఎంతకు తెగించావు రా! మాజీ ప్రియురాలి హత్యకు ప్లాన్ చేసిన యువకుడిని పట్టించిన ‘చాట్‌జీపీటీ’!
Man Tells Chatgpt He Plans To Kill Ex
Sharada V
|

Updated on: Aug 18, 2026 | 5:16 PM

Share

సమయానికి స్పందించిన చాట్‌ జీపీటీ  నేరాన్ని అడ్డుకుని ఓ యువతిని కాపాడింది. తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ పై కక పెంచుకున్న ఓ యువకుడు ఏకంగా  ఆమె ప్రాణాలు తీయాలనేంత కసితో రగిలిపోయాడు.  తన ప్లాన్ వివరాలను  చాట్‌జీపీటీతో పంచుకున్నాడు. ఇటీవలి కాలంలో డిప్రెషన్ కు గురైన వారు,  నేర ప్రవృత్తి ఉన్న వారు ఏఐ చాట్‌బాట్‌ను ఆశ్రయించడం ఎక్కువవుతోంది. గతంలో కొన్ని కేసుల్లో ఈ బాట్‌లు సరిగ్గా స్పందించలేదనే విమర్శలొచ్చాయి. ఈసారి ఓపెన్ఏఐ తక్షణం స్పందించింది. హెచ్చరికలతో సరిపెట్టకుండా నేరుగా చట్టబద్ధమైన చర్యలు తీసుకుంది. నేరాలకు పాల్పడేవారికి గట్టి సందేశాన్ని పంపింది

అసలేం జరిగింది?

ఫ్లోరిడాలో నివాసం ఉంటున్న 25 ఏళ్ల డాక్టర్‌ జౌ తన మాజీ లవర్‌ను హత్య చేయాలని ప్లాన్ వేసాడు. ఇందుకోసం తను వాడే ఆయుధాల వివరాలను టైప్ చేస్తూ చాట్‌జీపీటీతో చర్చించాడు. అది సరదాగా చేసిన చాట్ కాదని, నిజంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రహించింది చాట్‌జీపీటీ.  కేవలం బ్లాక్ చేసి ఊరుకోకుండా, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా FBI కి సమాచారం ఇచ్చింది.

జౌ ఓ యువతిని ప్రేమించాడు.  బ్రేకప్ అనంతరం అతడు  ఆమెపై తీవ్ర ద్వేషం పెంచుకున్నాడు.  అతని మాటల తీరు మారడం, అత్యాచారం, హత్య కు ప్లాన్ చేయడం జరిగాయి.  ఒక రోజు “ఈ నెలాఖరుకి ఆమెను చంపేస్తాను. ఆమె నాకు దక్కకపోతే ఇంకెవరికీ దక్కకూడదు” అని టైప్ చేశాడు. స్థానికంగా ఉన్న జిమ్ వద్ద పూలతో వేచి ఉండి, ఆమె ఒప్పుకోకపోతే  తుపాకీతో బెదిరించి ఇంటికి తీసుకెళ్లి, అత్యాచారం చేసి చంపేస్తాననీ  ప్లాన్ ను  వివరంగా చాట్‌జీపీటీతో చర్చించాడు.

డారెన్ జౌ తన దగ్గరున్న ఎఆర్‌-15 రకం రైఫిల్, గ్లోక్ పిస్టల్, 12-గేజ్ షాట్‌గన్ తుపాకుల ఫొటోలను మాజీ ప్రేయసికి పంపి భయపెట్టినట్లు చాట్‌బాట్‌తో అన్నాడు. ఓపెన్ఏఐ పంపిన ఎమర్జన్సీ మెసేజ్ చూసి స్పందించిన  FBI పోలీసులు జౌను అరెస్ట్ చేశారు.   దాదాపు రెండు నెలలు చాట్‌జీపీటీతో జరిపిన సంభాషణలను సేకరించి, కోర్టుకు సమర్పించారు. ఆగస్టు 13న జౌ కోర్టులో తన తప్పును ఒప్పుకున్నాడు. జడ్జి స్కాట్ సుస్కోయర్ అతనికి 8 ఏళ్ల పాటు ప్రొబేషన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసారు.  అమెరికాలోని ‘ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ కాల్పుల ఘటనలో కూడా నిందితుడు దాడికి ప్లాన్ చేయడానికి చాట్‌జీపీటీని వాడినట్లు దర్యాప్తులో తేలడంతో ఏఐ భద్రతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us