తెలుగును ఎంతో ఇష్టపడతా.. ఛాన్స్ వస్తే మళ్లీ సినిమాలు చేస్తా
26 September 2026
Rajeev
Pic credit - Instagram
ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ రకుల్ ప్
రీత్ సింగ్.
స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుస విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసింది.
ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్.. కొంతకాలంగా తెలుగు తెరపై కనిపించకపోవడంతో ఆమె టాలీవుడ్‌కు పూర్తిగా దూరమైనట్టేనా అనే చర్చ మొదలైంది.
అయితే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం తెలుగు సినిమాలకు గుడ్‌బై చెప్పినట్టుగా ఎక్కడా చెప్పలేదు.
పైగా మొన్నామధ్య ఇచ్చిన ఇంటర్వ్యూల్లో టాలీవుడ్‌పై తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని స్పష్టంగా వెల్లడించింది.
హైదరాబాద్ తన కెరీర్‌కు ఎంతో ప్రత్యేకమైన నగరమని, తన సినీ ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైందని ఆమె గుర్తుచేసుకుంది.
తాను ఇప్పటికీ తెలుగును ఎంతో ఇష్టపడుతున్నానని, తెలుగు సినిమాల్లో మళ్లీ నటించాలనే ఆసక్తి ఉందని తెలిపింది.