AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fauzi: ఫౌజీ లుక్.. హను రాఘవపూడి దాగుడు మూతలు

Fauzi: ఫౌజీ లుక్.. హను రాఘవపూడి దాగుడు మూతలు

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 18, 2026 | 8:06 PM

Share

ప్రభాస్‌ ‘ఫౌజీ’ కొత్త పోస్టర్‌ అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచుతోంది. హను రాఘవపూడి మరోసారి హీరో ముఖాన్ని చూపించకుండా, బాడీ లాంగ్వేజ్‌తోనే పోస్టర్‌ను డిజైన్‌ చేశారు. మండుతున్న చార్మినార్‌ నేపథ్యంలో రెండు తుపాకులతో ప్రభాస్‌ కనిపించడం కథపై ఆసక్తిని పెంచుతోంది. ‘మోస్ట్‌ వాంటెడ్‌ సిన్స్‌ 1932’ అనే హింట్‌తో పాటు స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే యాక్షన్‌ డ్రామా అని తెలుస్తోంది. డిసెంబర్‌ 3న విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ప్రభాస్ ‘ఫౌజీ’ అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్న వేళ తాజాగా అదిరిపోయే పోస్టర్ వచ్చింది.. కానీ ఎప్పట్లాగే ఈ పోస్టర్‌లోనూ హీరో మొహం దాచేసారు హను. కేవలం బాడీ లాంగ్వేజ్‌తో పోస్టర్ డిజైన్ చేసారు. అసలెందుకు హను ప్రతీసారి ప్రభాస్ ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు..? ఫేస్ దాచేసినా.. హింట్స్ మాత్రం చాలానే ఇచ్చారు హను.. మరి అవేంటో చూద్దామా..? ఫౌజీ పోస్టర్స్‌లో ఇప్పటి వరకు ప్రభాస్ మొహాన్ని క్లియర్‌గా చూపించలేదు హను రాఘవపూడి. ఈసారి కూడా మొహం దాచేసారు. మండుతున్న చార్మినార్ బ్యాక్‌ డ్రాప్‌లో, రక్తంతో తడిసిన బట్టలతో చేతిలో రెండు తుపాకులతో ప్రభాస్ నడిచొస్తున్న తీరు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.. ఫేస్ కనిపించకపోయినా కేవలం ఆ ఆకారం చూస్తుంటేనే ప్రభాస్ ఎంత వైల్డ్‌గా కనిపించబోతున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. కొత్త పోస్టర్‌లో చాలా హింట్సే ఇచ్చారు హను రాఘవపూడి. ఓవైపు గాంధీ అహింసా మార్గంలో వెళ్తుంటే.. దానికి వ్యతిరేక దిశలో హీరో ఆయుధాలు పట్టుకుని వెళ్లడం చూస్తుంటే స్వాతంత్ర్య పోరాటంలో భగత్ సింగ్ లాంటి పాత్ర చేస్తున్నారని తెలుస్తోంది. దానికి తోడు మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 అనే ముద్ర కూడా ఉండటంతో ఈ కథ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే భారీ యాక్షన్ డ్రామా అని తేలిపోయింది. ఈ పోస్టర్ మీద ఏ బెటాలియన్ హూ ఫైట్స్ అలోన్ అని పెట్టిన క్యాప్షన్ చూస్తుంటే.. ఒంటరిగానే ఓ సైన్యంలా బ్రిటీష్ వాళ్ళను ఎదిరించే వీరుడి కథ అనిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫౌజీ డిసెంబర్ 3న విడుదల కానుంది. ఇమాన్వి ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు.. మొత్తానికి ఈ సెటప్ అంతా చూస్తుంటే ఈసారి బాక్సాఫీస్ బద్ధలవ్వడం ఖాయమని అర్థమైపోతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. ఆకాశంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం..

దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత

ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా..

ఫ్రిజ్‌ ఓపెన్‌ చేయడానికి వెళ్లిన మహిళ.. అక్కడ సీన్‌ చూసి గుండె గుభేల్‌

కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి.. ఎందుకో తెలిస్తే వెన్నులో వణుకే!

Follow Us