AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇలాంటి చోరీ ఎప్పుడూ చూసుండరు.. రెప్పపాటులో రూ.10లక్షల బంగారం ఎత్తుకెళ్లిన మహిళ!

బంగారం కొంటామని షాప్‌కు వచ్చారు.. మంచి డిజైన్లు చూపెట్టమని సిబ్బందిని మాటల్లో పెట్టారు. కట్ చేస్తే క్షణాల్లో రూ. 10 లక్షల విలువైన ఆభరణాలతో అక్కడి నుంచి పరారయ్యారు. సంగారెడ్డి జిల్లాలోని ఓ గోల్డ్‌ షాప్‌లో వెలుగు చూసిన ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Viral Video: ఇలాంటి చోరీ ఎప్పుడూ చూసుండరు.. రెప్పపాటులో రూ.10లక్షల బంగారం ఎత్తుకెళ్లిన మహిళ!
Sangareddy Gold Theft
P Shivteja
| Edited By: |

Updated on: Aug 19, 2026 | 2:28 PM

Share

సంగారెడ్డి జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. బంగారం కొంటామని షాప్‌కు వచ్చిన మహిళలు రెప్పపాటులో రూ. 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం సాయంత్రం జహీరాబాద్‌లోని ఒక గోల్డ్‌ షాప్‌కు బంగారం కొందామని బురఖాలు ధరించిన నలుగురు మహిళలు వచ్చారు. ముక్కుపుడకలు చూపించాలని సదరు షాప్ సిబ్బందిని అడిగారు. దీంతో షాప్‌లో ఉన్న సిబ్బంది వాళ్లకు అక్కడ ఉన్న డిజైన్లు చూపించడం మొదలుపెట్టారు.

ఇలా ఆ మహిళలు మాటలతో దుకాణ సిబ్బంది దృష్టిని మళ్లించారు. ఆమె వేరే డిజైన్ చూపించేందుకు వెనక్కి తిరగ్గా.. నలుగురిలోని ఓ మహిళ అక్కడే డెస్క్‌లో ఉన్న బంగారు ఆభరణాల పెట్టెను క్షణాల్లో మాయం చేసింది. సిబ్బంది మళ్లీ ఇటు తిరిగేలోపు ఆ బాక్స్‌ను దాచేసింది. కాసేపటికి మళ్లీ వస్తామని చెప్పి ఆ నలుగురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు మొత్తం షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఆ మహిళలు షాపు నుంచి వెళ్లిపోయిన తర్వాత డెస్క్‌లో ఉన్న బంగారు ఆభరణాల ట్రే కనిపించకపోవడంతో కంగారుపడిన సిబ్బంది సీసీ కెమెరాలు చెక్ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!