AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మ స్టార్ హీరోయిన్, నాన్న తోప్ హీరో.. కానీ ఈ బ్యూటీకి ఒక్క హిట్ లేదు..! ఈ భామ ఎవరంటే

సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే కొంతమందికి మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు. అలాంటి వారిలో ఓ హీరోయిన్ కూడా ఉన్నారు.

అమ్మ స్టార్ హీరోయిన్, నాన్న తోప్ హీరో.. కానీ ఈ బ్యూటీకి ఒక్క హిట్ లేదు..! ఈ భామ ఎవరంటే
Actress
Rajeev Rayala
|

Updated on: Jul 01, 2026 | 11:00 AM

Share

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాగా ఫిలిం బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వారు మాత్రం రాణించలేకపోతున్నారు. నటవారసులుగా ఎంట్రీ ఇచ్చిన చాలా మంది అనుకున్నంత సక్సెస్ కాలేకపోతున్నారు. అందం, అభినయం ఉన్నా ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు ఇండస్ట్రీలో కోకొల్లలు వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు.  స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. కానీ అంతగా సక్సెస్ కాలేకపోతోంది ఈ అమ్మడు. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసినా కూడా అంతగా సక్సెస్ కాలేకపోతుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఆమె అందంలోనూ అప్సరసే.. ఇంతకూ ఆమె ముద్దుగుమ్మ ఎవరో కాదు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్‌గా ఎదిగారు. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు శివాత్మిక రాజశేఖర్. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించిన రాజశేఖర్, జీవిత కూతురు శివాత్మిక. అందం అభినయం కలబోసిన ఈ కుర్రాది మంచి క్రేజ్ సొంతం చేసుకుంది, కాగా శివాత్మిక దొరసాని సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

అంతే కాదు తమిళ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేసింది. అక్కడ ఆనందం విలయదుం వీడు, నితమ్ ఒరు వానం సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇక తెలుగులో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన పంచతంత్రం, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగ మార్తాండ సినిమాలు చేసింది. వాటిలో రంగమార్తాండ సినిమా కాస్త పర్లేదు అనిపించుకుంది. అమ్మ నాన్న స్టార్స్ అయ్యుండి కూడా శివాత్మికకు ఆశించిన స్థాయిలో అవకాశాలు, అదేవిధంగా హిట్స్ రావడం లేదు. ఈ అమ్మడు ఇప్పుడు కొత్త సినిమాల విషయం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే వరుసగా సినిమాలు చేయకుండా చిన్న గ్యాప్ ఇచ్చింది.  కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ క్రేజీ బ్యూటీ. శివాత్మిక అక్క శివాని కూడా హీరోయిన్ గా సినిమాలు చేసిన విషయం తెలిసిందే..

శివాత్మిక ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us