దూసుకుపోతున్న కన్నడ సుందరి.. బ్యాక్ టు బ్యాక్ బడా మూవీస్ 

18 August   2026

Rajeev 

Pic credit - Instagram

2019లో వచ్చిన కన్నడ చిత్రం బిర్బల్‌ ట్రిలజీ: కేస్‌ 1 – ఫైండింగ్‌ వజ్రమునితో రుక్మిణి  ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

 తొలి చిత్రంతోనే తన నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తరువాత మంచి అవకాశాలు అందుకుంది

రక్షిత్‌ శెట్టి సరసన సప్త సాగరాలు దాటి – సైడ్‌ A, సైడ్‌ B చిత్రాల్లో ‘ప్రియ’ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ

పాత్రకు ఆమె ఫిల్మ్‌ఫేర్‌ క్రిటిక్స్‌ అవార్డు ఫర్‌ బెస్ట్‌ యాక్ట్రెస్‌ – కన్నడను గెలుచుకున్నారు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. 

బానదారియల్లి, బఘీరా, భైరతి రణగల్ వంటి కన్నడ చిత్రాలతో రుక్మిణి క్రేజ్ పెరిగిపోయింది.

2024లో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.  కాంతార చాప్టర్‌ 1 సినిమా ఈ బ్యూటీకి భారీ హిట్ ఇచ్చింది. 

ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో నటిస్తుంది. అలాగే యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనుంది.