Ilayaraja: ఇళయరాజాను కావాలనే టార్గెట్ చేశారా?
సూర్య నటిస్తున్న ‘కరుప్పు’ సినిమా ఇళయరాజా వివాదంతో వార్తల్లో నిలిచింది. సినిమాలోని ఓ సీన్ ద్వారా కాపీరైట్ వివాదాలపై సెటైర్ వేశారనే విమర్శలు రావడంతో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ స్పందించింది. ఇళయరాజాను అవమానించే ఉద్దేశం లేదని స్పష్టం చేస్తూ, ఆయన మనస్తాపానికి గురై ఉంటే క్షమాపణలు చెబుతూ ఆ సన్నివేశాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ఇళయరాజా.. ఒకప్పుడు ఈ పేరు వింటే ఆహ్లాదకరమైన సంగీతం వినిపించేది.. కానీ ఇప్పుడలా కాదు రాజా గారి పేరు వింటే చాలు దర్శక నిర్మాతల్లో భయం పుడుతుంది. ఎప్పుడు ఏ సినిమాపై ఆయన కన్నెర్రజేస్తారో అని బానే కంగారు పడుతున్నారు వాళ్లు. తాజాగా సూర్య సినిమాపై మ్యాస్ట్రో ఎఫెక్ట్ పడింది. మరి కరుప్పు టీంతో ఇళయరాజాకు ఉన్న సమస్యేంటి..? పదేళ్ళ తర్వాత సూర్య గాల్లో తేలిపోతున్నారిప్పుడు.. చివరగా 2011లో వచ్చిన సెవెన్త్ సెన్స్ తర్వాత ఆయనకు మరో కమర్షియల్ హిట్ రాలేదు. ఇన్నేళ్ల తర్వాత కరుప్పుతో రికార్డుల వేట సాగిస్తున్న సూర్యకు ఇళయరాజా వైపు నుంచి అనుకోని షాక్ తగిలింది. అసలే ఈ మధ్య తన పాటలెవరు వాడినా రాజా గారు ఫైర్ అవుతున్నారు.. తన అనుమతి తీసుకున్నారు కాబట్టి చిరంజీవి సినిమాను మాత్రమే వదిలేసారు. ఒకప్పుడు ఇళయరాజా పేరు వింటే అద్భుతమైన పాటలు వినిపించేవి.. కానీ ఇప్పుడు ఆయన పేరు చెప్తే దర్శక నిర్మాతలు వణికిపోతున్నారు. తన పాటలు వాడినా, పాడినా అస్సలు ఒప్పుకోరీయన. అది తెలిసి కూడా సూర్య కరుప్పులో ఇలాంటి సీనే ఒకటి పెట్టారు. బ్యాగ్రౌండ్‌లో విజయ్‌కాంత్ పాట వస్తుంటే కాపీ రైట్స్ వివాదాన్ని టచ్ చేస్తూ ఇళయరాజాపై సెటైర్ వేశారు కరుప్పు టీం. దీనిపై కరుప్పు టీం స్పందించింది. సినిమాలో ఆ పర్టిక్యులర్ సీన్ ఇళయరాజాను అవమానించాలని పెట్టింది కాదని.. తమకు ఆ ఉద్ధేశ్యం లేదని.. రాజా గారు నొచ్చుకుని ఉంటే క్షమాపణ చెప్తున్నామంటూ లెటర్ విడుదల చేసింది డ్రీమ్ వారియర్ పిక్చర్స్. అంతేకాదు.. ఆ సీన్ తొలగిస్తున్నట్లు తెలిపారు మేకర్స్. ఏదేమైనా మ్యాస్ట్రో గురించి తెలిసి.. మళ్లీ ఆయనతో పెట్టుకోవడం అంటే సాహసమనే చెప్పాలేమో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో… ఆ ఊరి నిండా పాములే! ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న గ్రామం
Aadhaar Update: ఆధార్ అప్డేట్‌పై కేంద్రం గుడ్ న్యూస్
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

