AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: అమ్మానాన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరోయిన్ శ్రీలీల.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

జయపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న శ్రీలీల చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 26న విడుదల కానుంది.

Sreeleela: అమ్మానాన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరోయిన్ శ్రీలీల.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
Sreeleela
Basha Shek
|

Updated on: Feb 14, 2026 | 7:30 AM

Share

వరుసగా ఫ్లాపులు పడుతన్నా శ్రీలీల జోరు మాత్రం ఆగడం లేదు. స్టార డైరెక్టర్లు, నిర్మాతలు ఆమెతో సినిమాలు చూసేందుకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా లీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటోంది. ఇటీవలే పరాశక్తి అనే సినిమాలో హీరోయిన్ గా మెరిసింది శ్రీలీల. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో శ్రీలీలకు మరోసారి నిరాశ తప్పలేదు. అయితే మరో నెల రోజుల్లో మరో సినిమాతో ఆడియెన్స్ కు పలకరించేందుకు సిద్ధమవుతోందీ అందాల తార. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలసి ఆమె నటించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి . హారీశ్ శంకర తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోన్న ఈ మూవీ మార్చి 26న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన ఉన్నత చదువులు కూడా పూర్తి చేస్తోంది శ్రీలీల. ఇటీవల ఆమె తన ఎంబీబీఎస్ డిగ్రీ పట్టా కూడా అందుకుంది. తన తల్లిదండ్రుల సమక్షంలో డాక్టర్ డిగ్రీ అందుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్రీలీల ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.

‘ నా జీవితంలో ఇదొక మైలురాయి. ఒక ప్రయాణంలో తెలిసి లేదా తెలియకుండా మీరు భాగమైన ప్రయాణం. ఇదొక పవిత్రమైన స్థలం నేనుగా ఉండగలిగే ప్రదేశం.. నేడు మీ అమ్మాయి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఇది కేవలం డిగ్రీ గురించి కాదు ఇది నా ఎదుగుదల , నమ్మకం’ అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది శ్రీలీల. ప్రస్తుతం ఈ హీరోయిన్ పోస్ట్ నెట్టింట బాగా వైరలవుతోంది. దీనిని చూసిన సినీ ప్రముఖులు, నెటిజన్లు శ్రీలీలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ తన చదువులను కొనసాగిస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

తల్లిదండ్రులతో హీరోయిన్ శ్రీలీల..

View this post on Instagram

A post shared by SREELEELA (@sreeleela14)

ధనుష్ సినిమాలో శ్రీలీల..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us