Kantara Chapter 1: ఎంత పనిచేశావ్ అమ్మడు!‘కాంతారా 2’ లో హీరోయిన్ రోల్ రిజెక్ట్ చేసిన టాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా?
కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంతారా ఛాప్టర్ 1. లేటెస్ట్ సెన్సేషన్ రుక్మిణీ వసంత్ ఇందులో కథానాయికగా నటించింది. సినిమాలో ఈ అందాల తార అభినయానికి విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. రిషభ్ కు పోటీగా నటించిందనే కాంప్లిమెంట్స్ వినిపిస్తున్నాయి.

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతారా ఛాప్టర్ 1 బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. బరిలో ధనుష్ సినిమా ఉన్నా అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతోది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 89 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం మొత్తం రెండు రోజుల్లో మొత్తం రూ.105.5 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. కన్నడతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. సుమారు మూడేళ్ల క్రితం వచ్చిన కాంతారకు ప్రీక్వెల్ గా కాంతారా ఛాప్టర్ 1 తెరకెక్కింది. మొదటి పార్ట్ ను తెరకెక్కించిన రిషభ్ శెట్టినే ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. అంతేకాదు మెయిన్ లీడ్ లో కూడా నటించాడు. ఇక ఈ మూవీలో హీరో రిషభ్ తర్వాత చెప్పుకోవాల్సింది హీరోయిన్ రుక్మిణీ వసంత్ రోల్ గురించి. ఇందులో ఆమె పోషించిన రాణి కనకవతి పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా రిలీజ్ కు ముందు రుక్మిణీ రోల్ గురించి పెద్దగా ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. జస్ట్ ఆమె పాత్ర, లుక్ కు సంబంధించి పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేశారు. కానీ కాంతార 2లో రుక్మిణీ రోల్ ను పవర్ ఫుల్ గా తీర్చిదిద్దాడు రిషభ్ శెట్టి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ను చూసి ఆడియెన్స్ ఆశ్చర్యపోతున్నారు.
కాంతార 2 సినిమాలో రుక్మిణీ దాదాపు మెయిన్ విలన్ రోల్ ను పోషించింది. క్లైమాక్స్ లో ఆమె హీరోతో పోరాటం చేసే దృశ్యాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. మొత్తానికి కాంతార 2తో రుక్మిణీ ఖాతాలో ఎట్టకేలకు ఒక బ్లాక్ బస్టర్ మూవీ చేరింది. అయితే రుక్మిణీ కంటే హీరోయిన్ రోల్ కోసం చాలా మందిని సంప్రదించాడట రిషభ్ శెట్టి. ఆడిషన్స్ కూడ చేశాడట. అందులో మన టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతోన్న శ్రీలీల కూడా ఉందట. అయితే సినిమాలో హీరోయిన్ ది నెగెటివ్ రోల్ కావడంతో శ్రీలీల తిరస్కరించిందట. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఒకవేళ కాంతార 2లో హీరోయిన్ రోల్ చేసి ఉంటే శ్రీలీల కెరీర్ కు చాలా ప్లస్ అయ్యేదేమో!
కాంతార 2 సినిమాలో రుక్మిణీ వసంత్..
Kanakavathi Fierce Reign Rukmini Vasanth owns every frame as Kanakavathi! Her power shots in #KantaraChapter1 are a masterclass in strength & grace. Bow to the queen! #RukminiVasanth #Rukmini #RukminiVasanthhot #Kantar #RishabShetty #DivineBlockbusterKantara pic.twitter.com/328OFKV2qh
— GlamorousGirls (@GlamorousGirls0) October 4, 2025
శ్రీలీల ఖాతాలో ఇప్పటికే చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అందం, అభినయం పరంగా మంచి మార్కులే పడుతున్నాయి ఈ అందాల తారకు. అయితే ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ రోల్స్ లోనే కనిపించింది శ్రీలీల. కానీ కాంతార 2 లాంటి యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రలు పడితేనే శ్రీలీలకు సినిమాల్లో లాంగ్ కెరీర్ ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Not just a character, she’s an emotion! Rukmini Vasanth’s aura in Kantara: Chapter 1 is beyond words 💫 #RukminiVasanth #Kantara #KantaraChapter1 #RishabShetty #KantaraChapter1Review #KantaraEverywhere pic.twitter.com/nlh9lsJ0C5
— M.ibrahim (@mibrahim12king) October 4, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








