Vijay Deverakonda- Rashmika: విజయ్ దేవరకొండల- రష్మికల సీక్రెట్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్!
టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాలు సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. శుక్రవారం (అక్టోబర్ 03) హీరో విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఈ శుభకార్యం జరిగింది. ఇరు కుటుంబ పెద్దలు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో విజయ్-రష్మికలు ఉంగరాలు మార్చుకున్నారు.

హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అయితే వీరెప్పుడూ తమ ప్రేమ బంధం గురించి అధికారికంగా మాట్లాడలేదు. కానీ ఇద్దరి సోషల్ మీడియా పోస్టుల, ఫొటోస్ మాత్రం విజయ్-రష్మికల డేటింగ్ ను చాలా సార్లు కన్ఫార్మ్ చేశాయి. ఫారిన్ టూర్లు, వెకేషన్ లు.. ఇలా ఎక్కడకు వెళ్లినా జంటగానే వెళ్లారు విజయ్ -రష్మిక. అయితే వేర్వేరుగా ఫొటోలు షేర్ చేస్తూ ఇన్ డైరెక్టుగా తమ ప్రేమ విషయాన్ని బయట పెడుతున్నారీ లవ్ బర్డ్స్. ఇక సినీ అభిమానులు కూడా విజయ్-రష్మికలు త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అదే నిజం కానుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లు నిశ్చితార్థం చేసుకున్నారు. శుక్రవారం (అక్టోబర్ 03) ఉదయం విజయదేవరకొండ ఇంట్లోనే ఈ ప్రేమ పక్షులు ఉంగరాలు మార్చుకున్నారు.
విజయ్ దేవరకొండ-రష్మిక ఎంగేజ్మెంట్ వేడుకకు కేవలం ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విజయ్-రష్మికల పెళ్లి జరగనుందని సమచారం. చాలా మంది సెలబ్రిటీ ల్లాగే వీరు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ కు ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే అత్యంత గోప్యతతో ఈ ఎంగేజ్ మెంట్ వేడుకలను నిర్వహించినట్లు తెలుస్తోంది. అలాగే దీనిపై ఇప్పటివరకు ఇంకా అధికారిక ప్రకటన కూడా రాలేదు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి గీత గోవిందం సినిమాలో నటించారు. అప్పటి నుంచే వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దీని తర్వాత డియర్ కామ్రెడ్ సినిమాలోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారీ లవ్ బర్డ్స్. ఈ రెండు సినిమాలతోనే వీరి మధ్య ప్రేమకు మంచి పునాది ఏర్పడిందని సమాచారం.
కాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు ఇప్పుడూ పాన్ ఇండియా స్టార్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే కింగ్ డమ్ సినిమాతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు విజయ్. మరోవైపు రష్మిక కూడా దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




