AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: కారు డిక్కీలో అమ్మాయి శవం.. ఓటీటీలో మతిపోగొట్టే క్రైమ్ థ్రిల్లర్.. దృశ్యం సినిమాకు మించి ట్విస్టులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కించిన గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా ఓజీ. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం (అక్టోబర్ 01) హైదరాబాద్ లో ఓజీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

OTT Movie: కారు డిక్కీలో అమ్మాయి శవం.. ఓటీటీలో మతిపోగొట్టే క్రైమ్ థ్రిల్లర్.. దృశ్యం సినిమాకు మించి ట్విస్టులు
OTT Movie
Basha Shek
|

Updated on: Oct 02, 2025 | 6:41 PM

Share

దసరా సెలవులు కదా! ఇంట్లోనే ఉంటూ ఓటీటీలో మంచి ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూడాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇదొక తమిళ్ క్రైమ్ థ్రిల్లర్. ప్రముఖ త‌మిళ్ క‌మెడియ‌న్ స‌తీష్ ఇందులో హీరోగా నటించడం విశేషం. కొన్ని నెలల క్రితం థియేటర్లలో విడుదలైన సూపర్ హిట్ గా నిలిచింది. ఆసక్తికరమైన కథా కథనాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో సాగే ఈ సినిమా ప్రేక్షకులకు మంచి థ్రిల్ అందించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమాకు ఐఎమ్ డీబీలోనూ 7.9/10 రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గౌతమ్ ( స‌తీష్) ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి. అయితే ఒక రోజు రాత్రి అతని జీవితం తలకిందులైపోతుంది. ఆల్కహాల్ తీసుకుని కార్ నడుపుతూ మోటార్ సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని తగిలిస్తాడు. ఈ ప్రమాదంలో బైకర్ చనిపోతాడు. భయంతో గౌతం ఆ శవాన్ని తన కార్ డిక్కీలో దాచేస్తాడు. అయితే దారి మధ్యలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో గౌతమ్ ను పట్టుకుంటారు. కార్‌ని పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళ్తారు. అయితే డిక్కీలో శవం ఉందని ఎవరూ గమనించరు. కానీ స్టేషన్ లో ఉండే ఒక క్రూరమైన పోలీస్ (మైమ్ గోపీ ) గౌతమ్ ను చూసి అనుమానపడతాడు.

ఓ వైపు గౌతమ్ తన కార్‌ని తిరిగి తీసుకోవడానికి, శవాన్ని దాచడానికి వేసే ప్లాన్స్, మరోవైపు పోలీస్‌ ల అనుమానాలు సినిమాను థ్రిల్లింగ్ గా మారుస్తాయి. ఈ మధ్యలో శవం గురించి ఒక ట్విస్ట్ తెలుస్తుంది. అమ్మాయి శవం వెనక ఊహించని మిస్టరీ బయటపడుతుంది? మరి ఆ మిస్టరీ ఏంటి? అమ్మాయిని ఎవరు చంపారు? అందులో గౌతమ్ ఎలా ఇరుక్కున్నాడు? చివరకు గౌతమ్ ఈ శవం నుంచి బయట పడతాడా ? లేదా? క్లైమాక్స్ ట్విస్ట్లు ఏమిటి ? అన్న విషయాలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ ఇంటెన్స్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే.

ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు సత్తం ఎన్ కైయిల్ (Sattam en kaiyil). సుమారు 2 గంటల 4 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీని బాగా ఎంజాయ్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కోడి పందెంలో రూ. కోటిన్నర గెలుచుకున్న రాజమండ్రి వ్యక్తి!
కోడి పందెంలో రూ. కోటిన్నర గెలుచుకున్న రాజమండ్రి వ్యక్తి!
నల్ల నాగుతో నాటకాలు.. తర్వాత జరిగింది ఇదే..!
నల్ల నాగుతో నాటకాలు.. తర్వాత జరిగింది ఇదే..!
పొట్టేలు తలకాయ కూర వండటం తెలియట్లేదా.. అమ్మమ్మల కాలం నాటి టిప్స్
పొట్టేలు తలకాయ కూర వండటం తెలియట్లేదా.. అమ్మమ్మల కాలం నాటి టిప్స్
బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా? ఈ పొరపాటు చేస్తే 50 శాతం నష్టమే!
బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా? ఈ పొరపాటు చేస్తే 50 శాతం నష్టమే!
14 ఏళ్లకే వ్యాపారం..19 ఏళ్లకే కోటీశ్వరుడు
14 ఏళ్లకే వ్యాపారం..19 ఏళ్లకే కోటీశ్వరుడు
గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న స్టార్ పేసర్
గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న స్టార్ పేసర్
మీరు వంటల్లో వాడే నూనె కల్తీదో.. కాదో..! ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా.
మీరు వంటల్లో వాడే నూనె కల్తీదో.. కాదో..! ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా.
నడుము, ఒంపులు తిప్పుతూ.. డాన్స్‌తో ఇరగదీసిన ఆంటీ..!
నడుము, ఒంపులు తిప్పుతూ.. డాన్స్‌తో ఇరగదీసిన ఆంటీ..!
అంబానీ ఇల్లుకు నెలకు విద్యుత్‌ బిల్లు ఎంత వస్తుందో తెలిస్తే షాకే!
అంబానీ ఇల్లుకు నెలకు విద్యుత్‌ బిల్లు ఎంత వస్తుందో తెలిస్తే షాకే!
ఎవరు జీవించాలో.. ఎవరు మరణించాలో నిర్ణయించడానికి మనం ఎవరం..?
ఎవరు జీవించాలో.. ఎవరు మరణించాలో నిర్ణయించడానికి మనం ఎవరం..?