AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dimple Hayathi: మరో వివాదంలో డింపుల్ హయాతి! పని మనుషులను వేధించిన టాలీవుడ్ హీరోయిన్! వీడియో వైరల్

కొన్నాళ్ల క్రితం పార్కింగ్ విషయంపై ప్రముఖ ఐపీఎస్ అధికారి, డీసీపీ రాహుల్ హెగ్డేతో గొడవ పడి వార్తల్లో నిలిచింది టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి. ఈ గొడవ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదీ అందాల తార. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక సినిమా మాత్రమే ఉంది.

Dimple Hayathi: మరో వివాదంలో డింపుల్ హయాతి! పని మనుషులను వేధించిన టాలీవుడ్ హీరోయిన్! వీడియో వైరల్
Tollywood Actress Dimple Hayathi
Basha Shek
|

Updated on: Sep 30, 2025 | 6:04 PM

Share

టాలీవుడ్ హీరోయిన్‌ డింపుల్‌ హయాతి మరో సారి చిక్కుల్లో పడింది. కొన్ని రోజుల క్రితం తన అపార్ట్ మెంట్ లో పార్కింగ్ విషయమై డీసీపీ రాహుల్ హెగ్డేతో గొడవపడిన ఆమె ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కుంది. డింపుల్ హయాతి ఇటీవల షేక్‌పేటలోని వంశీరామ్ వెస్ట్ వుడ్స్ అపార్ట్ మెంట్ కు షిఫ్ట్ అయ్యిందని సమాచారం. అక్కడ ఆమె తన పెంపుడు కుక్కల సంరక్షణ కోసం ఇద్దరు యువతులను స్టాఫ్‌గా నియమించుకుందట. అయితే వారిని ఆమె సరిగ్గా చూసుకోకుండా మానసికంగా, శారీరకంగా హింసించినట్టు ఆ యువతులను ఉద్యోగానికి పంపిన మహిళ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది. అందులో హీరోయిన్ డింపుల్ హయతీ, ఆమె కుటుంబ సభ్యులు ఒడిశా యువతలను అవమానించారని, మానసికంగా వేధించారని సదరు మహిళ ఆరోపించింది. పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా తన భర్తతో తిట్టించారంటూ ఆ అమ్మాయిలకు పని కుదిర్చిన ఓ మహిళ ఆరోపించింది. ‘మీరు నా చెప్పులంత వాల్యూ చేయరు.. మీరు ఎంత? మీ బ్రతుకెంత?’ అంటూ సదరు అమ్మాయిలతో డింపుల్‌ భర్త దురుసుగా ప్రవర్తించారట. జీతం కూడా ఇవ్వకుండా ఇంట్లో నంచి వెళ్లగొట్టడమే కాకుండా.. ‘మా ఆయన లాయర్‌ మీరు నన్ను ఏమీ పీకలేరు’ అంటూ డింపుల్‌ హయాతి కూడా ఒడిశా అమ్మాయిలపై ఫైర్‌ అయిందని ఆ మహిళ పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

అయితే ఈ వీడియోలో సదరు మహిళ తన వ్యాఖ్యల్లో ‘డింపుల్ భర్త’ అని తరచూ ప్రస్తావించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డింపుల్ హయాతి అసలు పెళ్లి ఎప్పుడు చేసుకుంది? భర్త కాకపోతే అపార్ట్ మెంట్ లో హీరోయిన్ తో కలిసి ఉన్న వ్యక్తి ఎవరు? అంటూ నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. అదే సమయంలో అమ్మాయిల పట్ల అలా దురుసుగా ప్రవర్తించిన డింపుల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఆరోపణలపై డింపుల్ హయాతి  ఎలా స్పందిస్తుందో చూడాలి.

నెట్టింట వైరలవుతోన్న వీడియో ఇదే..

సినిమాల విషయాలకొస్తే.. ‘రామబాణం’ లో చివరిగా కనిపించింది డింపుల్. దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆమె ప్రస్తుతం భోగి అనే సినిమాలో నటిస్తోంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..