AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం సిరీస్‌రా అయ్యా..! సీన్ సీస్‌కు సుస్సూ పడిపోతుంది.. ఎక్కడ చూడొచ్చంటే

ఓటీటీలకు క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం, ఇంగ్లీష్.. ఇలా అన్ని భాషల్లోనూ ఈ జానర్ సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక హారర్ థ్రిల్లర్ సినిమానే.

ఇదేం సిరీస్‌రా అయ్యా..! సీన్ సీస్‌కు సుస్సూ పడిపోతుంది.. ఎక్కడ చూడొచ్చంటే
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Oct 03, 2025 | 9:19 AM

Share

చాలా మంది సినీ లవర్స్ హారర్ సినిమాలు చూడటానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎంత భయంగా అనిపించినా కూడా కళ్లు మూసుకుంటూనే చూసేవారు చాలా మంది ఉంటారు. కానీ ఒంటరిగా చూడాలంటే మాత్రం భయమే.. ఓటీటీల్లోనూ హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కేవలం తెలుగులో సినిమాలు మాత్రమే కాదు ఇతరభాషల హారర్ సినిమాలు చూడటానికి కూడా ప్రేక్షకులకు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా తెరకెక్కి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కానీ ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతున్న ఈ వెబ్ సిరీస్ మాత్రం గుండెల్లో దడ పుట్టిస్తోంది. హారర్ మూవీ లవర్స్‏కు సైతం వణుకు పుట్టించే వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకీ ఆ వెబ్ సిరీస్ ఏంటో తెలుసా.. ?

అదే 1000 బేబీస్. మలయాళంలో నుంచి వచ్చిన ఈ న్యూ వెబ్ సిరీస్ హారర్ జానర్ కావడం విశేషం. ఇందులో సీనియర్ నటుడు రెహమాన్, నీనా గుప్తా ప్రధాన పాత్రలు పోషించగా.. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ గా దీనిని రూపొందించారు. మొదటి నుంచి ఫస్ట్ లుక్, ట్రైలర్, టీజర్ ఇలా అన్నింటిని క్యూరియాసిటిని కలిగిన ఈ వెబ్ సిరీస్.. గత ఏడాది అక్టోబర్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. విడుదలైన ఒక్కరోజులోనే ట్రెండింగా్ లో టాప్ కు వచ్చేసింది. మలయాళంలో రూపొందించిన ఈ 1000 బేబీస్ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఏడు భాషలలో అందుబాటులోకి వచ్చింది.

మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠి, బెంగాళీ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సిరీస్ చూసేందుకు ఓటీటీ హారర్ మూవీ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సిరీస్ కు మంచి వ్యూస్ వస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి నజీమ్ కోయ దర్శకత్వం వహించగా.. సంజు శివమ్, జాయ్ మాథ్యూ, ఆదిల్ ఇబ్రహీం, ఆశ్విన్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. ఆగస్ట్ సినిమా బ్యానర్ పై షాది నదేషన్ ఆర్య ఈ సిరీస్ నిర్మించారు. సస్పెన్స్ ట్విస్టులు, భయపెట్టించే విజువల్స్ తో ఈ సిరీస్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. ఈ సిరీస్ కు మొదటి నుంచి పాజిటివ్ రివ్యూస్ రావడంతో వ్యూస్ పెరుగుతున్నాయి. మరీ ఈ సిరీస్ మీరు చూడాలనుకుంటే హాట్ స్టార్‌లో అందుబాటులో ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!