OTT Movie: రిటైర్మెంట్ రోజే పోలీస్ మర్డర్.. ఓటీటీలో దూసుకెళుతోన్న ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
ఓటీటీలో ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ దూసుకుపోతోంది. ఆసక్తికరమైన కథా కథనాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఊహించని ట్విస్టులతో సాగుతూ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది. ఈ సినిమా నిడివి కూడా కేవలం 1 గంట 46 నిమిషాలు మాత్రమే. మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్.

ఓటీటీలో మలయాళం సినిమాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ క్రైమ్, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలైతే ఎగబడి మరీ చూస్తున్నారు ఆడియెన్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమానే. కొన్ని రోజల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మలయాళం ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఆసక్తికరంగా సాగే కథా కథనాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, మధ్యలో వచ్చే ట్విస్టులు మలయాళం ప్రేక్షకులకు మంచి థ్రిల్ అందించాయి. సుమారు 1 గంట 46 నిమిషాల క్రిస్పీ రన్‌టైమ్ తో సాగే ఈ మూవీకి ఐఎమ్‌డీబీలోనూ మంచి రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా కథంతా కేరళలోని ఒక పట్టణం చుట్టూ తిరుగుతుంది. సైమన్ అనే ఒక సీనియర్ పోలీస్ అధికారి తన రిటైర్మెంట్ రోజేన హఠాత్తుగా మరణిస్తాడు. చాలా మంది ఇది సాధారణ మరణం అనుకుంటారు. మరికొంతమంది ఆత్మహత్య అని భావిస్తారు. అయితే అతని మరణం వెనక ఓ మిస్టరీ ఉందని పోలీసులకు అనుమానం వస్తుంది. దీంతో ఈ కేసును దర్యాప్తు చేయడానికి మరో సిన్సియర్ ఐపీఎస్ అధికారి లాల్ మోహన్ రంగంలోకి దిగుతాడు. అతను కూడా సైమన్ మరణంలో ఏదో తప్పు ఉందని భావిస్తాడు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ సైమన్ జీవితంలోని రహస్యాలను, అతని శత్రువుల గురించి లాల్ మోహన్ తెలుసుకుంటాడు. సైమన్ మరణం ఆత్మహత్య కాదని, పక్కా ప్లానింగ్ మర్డర్ అని తెలుస్తుంది.
ఇలా దర్యాప్తు కొనసాగుతుండగానే జీవ అనే క్రిమినల్ జైలు నుంచి తప్పించుకుంటాడు. గతంలో జీవ, సైమన్ కి మధ్య గొడవలు జరిగినట్లు లాల్ మోహన్ తెలుసుకుంటాడు.ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు సినిమాను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. సైమన్ భార్య షైని, అతని సహోద్యోగి మానియా పై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తారు? మరి అసలు సైమన్ ఎలా చనిపోయాడు? ఇందులో ఎవరి పాత్ర ఉంది? లాల్ మోహన్ ఈ కేసును ఎలా పరిష్కరించాడు? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘పోలీస్ డే’. సంతోష్ మోహన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో టిని టామ్ (లాల్ మోహన్), నందు (సైమన్ ఇడికుల), అన్సిబా హాసన్ (మానియా), ధర్మజన్ బోల్గట్టి (భాసి), హరీష్ కణారన్ ప్రధాన పాత్రలు పోషించారు. క్రిస్పీ రన్ టైమ్ తో సాగే ఈ సినిమా ప్రస్తుతం మనోరమా మ్యాక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీని ఎంజాయ్ చేయవచ్చు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








