డిజాస్టర్ సినిమా..! థియేటర్స్‌లో పట్టించుకోలేదు.. కానీ ఓటీటీలో దుమ్మురేపిన మూవీ..
థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. రకరకాల సినిమాలు థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన సినిమాలు థియేటర్స్ లో దుమ్మురేపుతున్నాయి. అలాగే ఓటీటీల్లోనూ సినిమాలు మెప్పిస్తున్నాయి. ఇప్పటికే ఓటీటీల్లో తెలుగు, తమిళ్, కన్నడ , హిందీ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా ఆకట్టుకుంటున్నాయి.

థియేటర్స్ లో వారం వారం కొత్త కొత్త సినిమాలు విడుదలై పేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న చిన్న సినిమాల దగ్గర నుంచి భారీ బడ్జెట్ సినిమాలు కూడా విడుదలై ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక థియేటర్స్ లో విడుదలైన నెల రోజులకు సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. థియేటర్స్ లో వచ్చిన టాక్ ప్రకారం ఓటీటీలోకి సినిమాలు వస్తున్నాయి. అలాగే థియేటర్స్ లో డిజాస్టర్ అయిన సినిమాలు ఓటీటీలో మంచి టాక్ సొంతం చేసుకుంటున్నాయి. థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యి ఓటీటీలో హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇక రీసెంట్ గా థియేటర్స్ లో డిజాస్టర్ అయిన ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఊపేస్తోంది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన తమ్ముడు. రాబిన్ హుడ్ నిరాశపర్చడంతో తమ్ముడుపై భారీ ఆశలే పెట్టుకున్నాడు యూత్ స్టార్ నితిన్. పవన్ కల్యాణ్ టైటిల్, లయ రీ ఎంట్రీతో పాటు సినిమా పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండడంతో రిలీజ్ కు ముందే తమ్ముడు మూవీపై పాజిటిబ్ బజ్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు నిర్మాత దిల్ రాజు భారీగా ప్రమోషన్లు నిర్వహించారు. అయితే జులై 04న థియేటర్లలో విడుదలైన తమ్ముడు సినిమా ఆడియెన్స్ ను పూర్తిగా నిరాశపర్చింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.
వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ మూవీలో కాంతార బ్యూటీ సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. లయ, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుమారు 75 కోట్ల రూపాయల బడ్జెట్‌తో దిల్ రాజ్ ఈ సినిమాను నిర్మించారు. ఆగస్టు 01 నుంచే తమ్ముడు సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా మంచి క్రేజ్ సొంతం చేసుకుంటుంది. థియేటర్స్ లో డిజాస్టర్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళంలోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




