OTT Movie: అప్పుడే ఓటీటీలోకి అనుపమ దెయ్యం సినిమా.. సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మరో బ్లాక్ బస్టర్ మూవీ మిరాయ్ కు పోటీ తట్టుకుని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఆడియెన్స్ ను బాగా భయపెట్టిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం కిష్కింధపురి. రాక్షసుడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సాయి శ్రీనివాస్, అనుపమ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ఇది.కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజైంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. థియేటర్లలో ఆడియెన్స్‌ను భయపెట్టి మంచి థ్రిల్ పంచింది. మెగాస్టార్ చిరంజీవి తదితర సినీ ప్రముఖులు కిష్కింధపురి సినిమాను చూసి ప్రశంసించారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈమూవీ ఓవరాల్ గా రూ. 25 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. ఇప్పుడీ కిష్కింధపురి సినిమా ఓటీటీ ఆడియెన్స్ ను భయపెట్టేందుకు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుందని టాక్. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో ఓటీటీ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడుపోయినట్లు సమాచారం. కాగా థియేట్రికల్ రన్ దాదాపు పూర్తి కావడంతో కిష్కింధపురి సినిమాను ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యిందని సమాచారం. అక్టబర్ 17 నుంచి ఈ హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు రానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి నిర్మించిన కిష్కింధపురి సినిమాలో శాండీ మాస్టర్ విలన్ గా నటించాడు. మకరంద్ దేశ్ పాండే, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగర్, హైపర్ ఆది, సుదర్శన్, భద్రం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. చేతన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. కిష్కింధపురిలోని సువర్ణమాయ అనే ఓ పాడుబడిన ఇంట్లో కొందరు ఘోస్ట్ హంటర్స్ సాగించే వేట ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మొత్తం 11 మంది ఆ ఇంటికి వెళ్తారు. మొదట్లో సాదాసీదాగా కనిపించినా ఆ తర్వాత అందులో ముగ్గురు అనూహ్యంగా చనిపోతారు. దీంతో అసలు కథ మొదలవుతుంది. ఆతర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కిష్కింధపురి సినిమా చూడాల్సిందే.
• ZEE5 bagged the post-theatrical streaming rights of #Kishkindhapuri for a solid price.
• According to a recent report in OTT Play, the film will be up for streaming from October 17.
• An official confirmation is awaited. pic.twitter.com/4BXkISXdpB
— MOHIT_R.C (@Mohit_RC_91) September 30, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








