OTT Movie: ఓటీటీలో 2300 కోట్ల హారర్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్.. హార్ట్ పేషెంట్స్ అసలు చూడొద్దు
కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. రూ. 430 కోట్లతో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఓవరాల్ గా రూ. 2300 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది.

ఓటీటీలకు క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం, ఇంగ్లిష్.. ఇలా అన్ని భాషల్లోనూ ఈ జానర్ సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక హారర్ థ్రిల్లర్ సినిమానే. హాలీవుడ్ లో ఉన్న పలు పాపులర్ ఫ్రాంచైజ్, సిరీస్ లలో ఇది కూడా ఒకటి. ఇప్పటి వరకు ఈ సిరీస్ లో మొత్తం ఐదు సినిమాలు రిలీజయ్యాయి. అన్ని సినిమాలు బ్లాక బస్టర్స్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించాయి. ఇండియాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు కూడా ఈ ఫ్రాంచైజీ సినిమాలను ఎగబడి చూస్తారు. అలాంటి పాపులర్ ఫ్రాంచైజ్ నుంచి దాదాపు 14 ఏళ్ల తర్వాత ఆరో సినిమా వచ్చింది. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. గత సిరీస్ సినిమాల్లో లాగే ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆడియెన్స్ కు మంచి థ్రిల్ ఇచ్చింది. సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. సుమారు రూ.430 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.2300 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
ఇలా థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అయితే గుండె జబ్బులున్న వారు మాత్రం ఈ సినిమాకు దూరంగా ఉండడం మేలు. అలాగే చిన్న పిల్లలు కూడా చూడకపోవడమే మంచిది. ఇంతకీ ఆ భయానక సినిమా ఏదనుకుంటున్నారా? హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీ సినిమా ‘ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్’
జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..
Death runs in the family. #FinalDestinationBloodlines streaming 16th October onwards in English, Hindi, Tamil and Telugu only on JioHotstar.
[TonyTodd, Final Destination, Bloodlines, Horror, Thriller, Mystery, Supernatural, #JioHotstar] pic.twitter.com/0KYV64liqS
— OTT TELUGU (@GuruNat90064034) October 1, 2025
ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇండియన్ ఫ్యాన్స్‌కు మాత్రం వీక్షించే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో ‘ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్’ మేకర్స్ మరో ఓటీటీలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. జియో హాట్‌స్టార్ అక్టోబర్ 16 నుంచి ఈ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ సినిమా ను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ లోని ఓ సీన్..
Death is a relentless son of a *****. Final Destination Bloodlines – Only in Theaters and @IMAX May 16. #FinalDestination #FilmedforIMAX pic.twitter.com/I2RPyinzBf
— Final Destination Bloodlines (@FDMovie) March 25, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








