AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: గొడ్డలితో సైకో కిల్లర్ అరాచకాలు.. ఓటీటీలో కిర్రాక్ క్రైమ్ థ్రిల్లర్.. చిన్నపిల్లలతో చూడొద్దు

సైకో కిల్లర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. వెన్నులో వణుకు పుట్టించే సీన్లు, థ్రిల్లింగ్ ట్విస్టులతో సాగే ఈ సినిమాలు పెద్దల వరకు ఓకే కానీ.. పిల్లలకు అసలు చూపించనీయకూడదు.

OTT Movie: గొడ్డలితో సైకో కిల్లర్ అరాచకాలు.. ఓటీటీలో కిర్రాక్ క్రైమ్ థ్రిల్లర్.. చిన్నపిల్లలతో చూడొద్దు
OTT Movie
Basha Shek
|

Updated on: Sep 29, 2025 | 6:17 PM

Share

సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ లేదా సైకో కిల్లర్ సినిమాలన్నీ ఒకే రకంగా సాగుతుంటాయి. సైకో కిల్లర్ ఒక మోటివ్ తో వరుస హత్యలు చేయడం, పోలీసులు ఆ కిల్లర్ ను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేయడం.. ఇన్వెస్టిగేషన్ లో సంచలన నిజాలు వెలుగులోకి రావడం.. క్లైమాక్స్ లో ఊహించని ట్విస్టులు.. దాదాపు ఇలాగే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలన్నీ సాగుతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు చెందినదే. ఇదొక అమెరికన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్. ఇందులో ముసుగు ధరించిన కిల్లర్ వరుస హత్యలు చేస్తాడు. గొడ్డలితో అరాచకం సృష్టిస్తాడు. ఈ సైకో కిల్లర్ మారణ హోమానికి తొమ్మిది మంది బలవుతారు. దీంతో ఈ హత్యల మిస్టరీని ఛేదించేందుకు ఒక సిన్సియర్ పోలీసాఫీసర్ రంగంలోకి దిగుతాడు. సైకో కిల్లర్ ను ట్రాక్ చేస్తూ ఒక రెస్టారెంట్ కు చేరుకుంటారు. అక్కడ కనిపించిన ఫేస్ మాస్క్, దుస్తులను చూసి సైకో కిల్లర్ రెస్టారెంట్ లోపల ఉన్నాడనుకుంటారు. అయితే విచిత్రంగా ఆ రెస్టారెట్ లో చాలా మంది వ్యక్తులు ఉంటారు. అందరూ అనుమానితులుగానే కనిపిస్తారు.

సైకో కిల్లర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి పోలీసులు తమ తెలివికి పని చెబుతారు. రెస్టారెంట్ లో ఉన్న వారందరినీ రకరకాల ప్రశ్నలు వేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. రాత్రి జరిగే ఈ విచారణలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటాయి. మరి పోలీసులు ఆ సైకో కిల్లర్ ను పట్టుకున్నారా? అసలు ఆ హంతకుడి మోటివ్ ఏంటి? ఎందుకు వరుస హత్యలకు పాల్పడ్డాడు? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ అమెరికన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే.

ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సీన్లు, థ్రిల్లింగ్ ట్విస్టులతో సాగే ఈ సినిమా పేరు బోన్ ఫేస్ ( Bone Face). మైఖేల్ డొనోవన్ హార్న్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో జెరెమీ లండన్, ఎలెనా సాంచెజ్, మాడిసన్ వోల్ఫ్ తదతరులు ప్రధాన పాత్రల్లో నటించారు. 2025 జనవరి 21 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ, Tubi ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సుమారు 1 గంట 34 నిమిషాల నిడివితో సాగే ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కు ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీలో హింసాత్మక సన్నివేశాలు చాలా ఉన్నాయి. కాబట్టి చిన్న పిల్లలతో మాత్రం అసలు చూడొద్దు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.