AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నటి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేని భర్త.. ఆమె బ్రష్‌తోనే పళ్లు తోముకుంటోన్న నటుడు.. చివరకు ఆమె బట్టల్నే…

ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కట్టేకాలేదాకా కలిసుందామని అగ్ని సాక్షిగా ప్రమాణం చేశారు. అందుకు తగ్గట్టుగానే గత కొన్నేళ్లుగా ఎన్ని కష్టాలొచ్చినా కలిసే పంచుకున్నారు. వైవాహిక జీవితాన్ని ఆస్వాదించారు. కానీఈ జంటను విధి చిన్న చూపు చూసింది. మళ్లీ ఎప్పుడూ కలుసుకోలేని విధంగా ఇద్దరినీ విడగొట్టింది.

నటి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేని భర్త.. ఆమె బ్రష్‌తోనే పళ్లు తోముకుంటోన్న నటుడు.. చివరకు ఆమె బట్టల్నే...
Shefali Jariwala
Basha Shek
|

Updated on: Sep 28, 2025 | 12:40 PM

Share

ప్రముఖ బాలీవుడ్ నటి, ‘కాంటా లగా’ సాంగ్‌ ఫేమ్‌ షెఫాలీ జరివాలా మరణించి మూడు నెలలు పైనే అవుతోంది. కానీ ఈ విషాదాన్ని ఆమె భర్త, ప్రముఖ నటుడు పరాగ్ త్యాగి అసలు మర్చిపోలేకపోతున్నాడు. అనుక్షణం తన భార్యను, ఆమెతో కలిసి గడిపిన మధుర క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటూ కుమిలిపోతున్నాడు. తన భార్య మరణాన్ని జీర్ణించుకోలేని పరాగ్ త్యాగి ఆమె ఫొటోను తన హృదయంపై పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. తాజాగా తన భార్య పేరు, తన పేరు కలిసేలా ‘షెఫాలీ పరాగ్‌ త్యాగి’ అంటూ ఓ పాడ్‌కాస్ట్‌ చానల్‌ను ప్రారంభించాడు. అందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటున్నాడు. ఈ సందర్భంగా పరాగ్ మాట్లాడుతూ.. ‘ ఇప్పుడు నేను షెఫాలీ బ్రష్‌తోనే పళ్లు తోముకుంటున్నాను. తన దిండుపైనే నిద్రిస్తున్నాను. తన టీషర్ట్స్‌, షార్ట్స్‌ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. వాటినెప్పుడూ నాపక్కనే పెట్టుకుంటున్నాను. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో తను ఆర్డర్‌ చేసిన వస్తువులు ఇప్పటికీ డెలివరీ అవుతూనే ఉన్నాయి. ఆమె విడిచిన దుస్తుల్ని ఇంతవరకు ఉతకలేదు. అవి మరీ చిన్నగా ఉండటం వల్ల ధరించలేకపోతున్నాను. కానీ, వాటిని కప్పుకునే ప్రతిరోజు నిద్రిస్తున్నాను’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు పరాగ్.

ఇక షెఫాలీతో తాను గడిపిన చివరి క్షణాలను మరోసారి గుర్తు తెచ్చుకున్నాడు పరాగ్ త్యాగి.. ‘షెఫాలీ చివరిరోజు మా సింబా(పెట్ డాగ్)ను వాకింగ్‌కు తీసుకెళ్లమని నాకు చెప్పింది. బయటకు వెళ్లి వచ్చేలోపు అపస్మారక స్థితిలో పడి ఉంది. సీపీఆర్‌ కూడా చేశాను. రెండుసార్లు శ్వాస తీసుకుంది. కానీ ఆ వెంటనే కన్నుమూసింది’ అని చెప్పుకొచ్చాడు పరాగ్.

ఇవి కూడా చదవండి

షెఫాలీ జరివాలా గురించి భర్త పరాగ్ త్యాగి మాటల్లో..

కాగా యాంటీఏజింగ్‌ డ్రగ్స్‌, ట్యాబ్లెట్ల వల్లే షెఫాలీ మరణించిందన్న వార్తలను పరాగ్‌ కొట్టిపారేశాడు. ఆమె ఎప్పుడూ డ్రగ్స్‌ వాడలేదని, కేవలం మల్టీ విటమిన్స్‌ టాబ్లెట్స్‌ మాత్రమే తీసుకునేదని క్లారిటీ ఇచ్చాడు.

షెఫాలీ జరివాలాతో భర్త పరాగ్ త్యాగీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..