AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇదెక్కడి సినిమారా బాబూ! అమ్మాయిల తల, మొండెం వేరు చేసే సైకో కిల్లర్..

మీకు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టమా? అయితే ఇది మీరు కచ్చితంగా చూడాల్సిన సినిమానే. విజయవాడలో జరిగే సీరియల్ మర్డర్స్ చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఎంతో ఉత్కంఠగా సాగే ఈ సినిమా ఆడియన్స్ కి మంచి ఇంటెన్స్ థ్రిల్ ని ఇస్తుంది.

OTT Movie: ఇదెక్కడి సినిమారా బాబూ! అమ్మాయిల తల, మొండెం వేరు చేసే సైకో కిల్లర్..
OTT Movie
Basha Shek
|

Updated on: Sep 26, 2025 | 7:11 PM

Share

ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారం ఓటీటీలో ఈ జానర్ సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో ఈ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీనే. ఈ సినిమా చివరి వరకు సస్పెన్స్, ట్విస్టులతో ఆడియన్స్ కి ఇంటెన్స్ థ్రిల్ ని ఇస్తుంది. విజయవాడలో అమ్మాయిల హత్యల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఒక సైకో కిల్లర్ నగరంలోని అమ్మాయిలను కిడ్నాప్ చేసి అత్యం దారుణంగా హతమారుస్తుంటాడు. అమ్మాయిల తల, మొండెంను వేరు చేసి చంపుతూ పోలీసులకు సవాల్ విసురుతాడు. దీంతో ఈ సైకో కిల్లర్ ను పట్టుకునేందుకు ఒక సిన్సియర్ పోలీసాఫీసర్ రంగంలోకి దిగుతుంది. ఆమె విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయి. కానీ ఒకనొకదశలో సైకో కిల్లర్ కారణంగా పోలీసాఫీసర్ జీవితం తలకిందులు అవుతుంది. ఉద్యోగానికి కూడా రాజీనామా చేయల్సి వస్తుంది. అయితే నగరంలో హత్యలు మరింత పెరిగిపోతాయి. దీంతో పోలీసు డిపార్ట్ మెంట్ తో సంబంధం లేకుండా సైకో కిల్లర్ ను పట్టుకునేందుకు హీరోయిన్ ప్రయత్నాలు చేస్తుంది.

ఈ క్రమంలోనే ఒక మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తే సైకో కిల్లర్ మోటివ్స్ బయటపడతాయి. మరి హీరోయిన్ ఆ సైకో కిల్లర్ ను పట్టుకుందా? అసలు ఆ కిల్లర్ గతం ఏమిటి? ఆడవాళ్లనే ఎందుకు టార్గెట్ చేసి చంపుతున్నాడు? పోలీసులకు ఎలా పట్టుబడ్డాడు? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు దక్షిణ. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు కాబోయే భార్య ధన్సిక ఇందులో ఏసీపీగా లీడ్ రోల్ పోషించడం విశేషం.  అలాగే రిషభ్ బాసు, మాగ్నా, కరుణ, అంకితా ములెర్, హిమా సైలజా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ  మూవీకి ఓషో తుల‌సీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సుమారు  2 గంటల 8 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈసినిమా IMDbలో 5.4/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా Lionsgate Play ఓటీటీ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ చిత్రాలను ఇష్టంగా చూసేవారికి దక్షిణ ఒక మంచి సినిమా అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పుదీనా వీరికి విషంతో సమానం.. తినే ముందు ఈ విషయాలు తప్పక..
పుదీనా వీరికి విషంతో సమానం.. తినే ముందు ఈ విషయాలు తప్పక..
నీచు వాసన రాకుండా బోటి కూర మధ్యలో ఇవి వేస్తే చాలు
నీచు వాసన రాకుండా బోటి కూర మధ్యలో ఇవి వేస్తే చాలు
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్