AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OG Movie Collections: థియేర్లలో ‘ఓజీ’ విధ్వంసం.. మొదటి రోజే పవన్ సినిమాకు రికార్డు కలెక్షన్లు.. ఎన్ని కోట్లంటే?

పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా రికార్డుల వేట షురూ చేసింది. గురువారం (సెప్టెంబర్ 25)న విడుదలైన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజే పవన్ మూవీకి భారీ కలెక్షన్లు వచ్చాయి.

OG Movie Collections: థియేర్లలో 'ఓజీ' విధ్వంసం.. మొదటి రోజే పవన్ సినిమాకు రికార్డు కలెక్షన్లు.. ఎన్ని కోట్లంటే?
Pawan Kalyan Og Movie OTT
Basha Shek
|

Updated on: Sep 26, 2025 | 4:21 PM

Share

పవన్ కల్యాణ్ ఓజీ సినిమా రికార్డుల వేట షురూ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ ఇప్పుడు వసూళ్లలో రికార్డులు కొల్లగొడుతోంది. గురువారం (సెప్టెంబర్ 25) న రిలీజైన ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్లపై చిత్ర బృందం అధికారికంగా అప్డేట్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.154కోట్లకుపైగా వసూలు చేసిందని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు పవర్‌ఫుల్‌ పోస్టర్‌ ను షేర్ చేస్తూ ‘ఇది పవన్‌ కల్యాణ్‌ సినిమా. చరిత్రను ఓజీ చెరిపేసింది’ అని క్యాప్షన్‌ కూడా జత చేసింది. ప్రీమియర్స్‌లోనూ అత్యధిక వసూళ్లు (గ్రాస్‌) రాబట్టిన సినిమాగా ‘ఓజీ’ నిలిచింది. కాగా పవన్ కల్యాణ్ కెరీర్ లోనే ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. ఫస్ట్‌ డే అత్యధిక వసూలు చేసిన టాప్‌-10 భారతీయ సినిమాల జాబితాలోనూ ‘ఓజీ’ స్థానం దక్కించుకుంది. అలాగే తెలుగు సినిమాల పరంగా మొదటి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ఓజీ ఏడో స్థానంలో నిలిచింది.

సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ హీరో ఇమ్రాన హష్మీ విలన్ గా కనిపించనున్నాడు. శ్రియా రెడ్డి, అర్జున్‌ దాస్‌, జగపతి బాబు, ప్రకాశ్‌ రాజ్‌, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్,  వెంకట్, కిక్ శ్యామ్, బిగ్ బాస్ శుభశ్రీ రాయగురు.. ఇలా భారీ తారగణమే ఓజీలో ఉంది. ఇక తమన్ అందించిన పాటలు, బీజీఎమ్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

ఇది పవన్ కల్యాణ్ సినిమా..

హైదరాబాద్ విమల్ థియేటర్ లో ఓజీ సినిమాను చూస్తోన్న కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..