AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంత చేతికున్న లగ్జరీ వాచ్‌ను చూశారా? రేటు తెలిస్తే నోరెళ్లబెడతారు

ఈ మధ్యన సినిమాలు చేయకున్నా ఇతర విషయాలతో వార్తల్లో నిలుస్తోంది స్టార్ హీరోయిన్ సమంత. ముఖ్యంగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరుతో సామ్ ప్రేమలో ఉందని తెగ ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ప్రేమ పక్షుల్లా ఎక్కడ పడితే అక్కడ జంటగా కనిపిస్తున్నారు సమంత- రాజ్

Samantha: సమంత చేతికున్న లగ్జరీ వాచ్‌ను చూశారా? రేటు తెలిస్తే నోరెళ్లబెడతారు
Samantha
Basha Shek
|

Updated on: Sep 25, 2025 | 9:48 AM

Share

గతంలో పోల్చితే ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. ఆ మధ్యన శుభం సినిమాతో నిర్మాతగా మారింది. ఆడియెన్స్ ను బాగానే మెప్పించిన ఈ మూవీలో ఒక కీలక పాత్ర కూడా పోషించింది సామ్. ఇప్పుడు మా ఇంటి బంగారం అనే సినిమాతో బిజీగా ఉంటోందీ అందాల తార. ఈ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో సామ్ తో ఆమె తెరకెక్కించిన ఓ బేబీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో పాటు రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లోనూ నటిస్తోందీ ముద్దుగుమ్మ. సినిమాలతో పాటు ఈ మధ్యన ఎక్కువగా పలు బ్రాండ్లకు ప్రమోటర్ గా వ్యవహరిస్తోంది సామ్. ఆ బ్రాండ్ల ప్రమోషన్లలో భాగంగా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసుకుంటుంది. తాజాగా ఒక లగ్జరీ వాచ్ ను ధరించిన సామ్ అందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఈ ఫొటోలు నెటిజన్లను కూడా అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సమంత ధరించిన ఆ వాచ్ ఏ కంపెనీది..? దాని ధర ఎంత ? అంటూ గూగుల్ లో ఆరా తీస్తున్నారు చాలా మంది.

ఈ నేపథ్యంలోనే సమంత ధరించిన లగ్జరీ వాచ్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్రాపేజ్డ్ ఆకారంలో ఉండే పియాజెట్ 60 జువెలరీ వాచ్ ను సామ్ ధరించిందని, దీని రేటు సుమారు రూ.30 లక్షలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అవాక్కవుతున్నారు. గతంలోనూ సమంత పలు స్టైలిష్ అండ్ లగ్జరీ వాచెస్ ధరించింది. బల్గారీ సర్పెంటీ వాచ్ (రూ. 45 లక్షలకు పైగానే) సామ్ చేతికి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇందులోనే చాలా మోడల్స్ సామ్ దగ్గర ఉన్నాయని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

లగ్జరీ వాచ్ తో సమంత..

ఇదిలా ఉంటే సమంత- రాజ్ ల ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ముంబై బాంద్రా లోని ఓ జిమ్ నుంచి కలిసే బయటకు వచ్చారు రాజ్- సమంత.  జిమ్ నుంచి బయటకు వచ్చి ఒకే కారులో వెళ్లిపోయిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా