AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Sirish: నగలు ఆడవాళ్లే ధరించాలా ఏంటి? వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు శిరీష్

అల్లు అరవింద్ చిన్న కుమారుడు, టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ఇటీవల పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. నైనిక రెడ్డి అనే అమ్మాయిని అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి వేడుకలో అల్లు శిరీష్ ముస్తాబైన తీరుపై కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Allu Sirish: నగలు ఆడవాళ్లే ధరించాలా ఏంటి? వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు శిరీష్
Allu Sirish Wedding
Basha Shek
|

Updated on: Mar 15, 2026 | 9:07 AM

Share

అల్లు అర్జున్ సోదరుడు, హీరో అల్లు శిరీష్, నయనిక రెడ్డి వివాహం మార్చి 6న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు పలువురు సినీ ,రాజకీయ ప్రముఖులు ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ పెళ్ల వేడుకలో అల్లు శిరీష్ వేషధారణపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. శిరీష్ ధరించిన భారీ నెక్లెస్, చోకర్ , వజ్రాభరణాలు చూసి చాలా మంది నెటిజన్లు మెచ్చుకుంటే, కొందరు మాత్రం ‘అమ్మాయిలు ధరించే నగలను మగవారు ధరించడం ఏంటి?’ అంటూ అల్లువారబ్బాయిని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై అల్లు శిరీష్ స్పందించాడు. తనను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ‘అబ్బాయిలకు నీలం, అమ్మాయిలకు గులాబీ రంగులు.. అబ్బాయిలు ప్యాంట్లు, అమ్మాయిలు నగలు.. ఇవన్నీ మనం సృష్టించుకున్ననియమాలు, నిబంధనలు మాత్రమే. మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను ఒక్కసారి పరిశీలించండి. అప్పట కాలంలో పురుషులు కూడా భారీ ఆభరణాలు ధరించేవారు. వంద సంవత్సరాల క్రితం వరకు పెర్ఫ్యూమ్స్‌లో కూడా మగ, ఆడ అనే తేడా ఉండేది కాదు’

‘అందుకే నన్ను ఎంత తిట్టుకున్నా సరే ఈ అడ్డుగోడల్ని కూల్చాలని అనుకున్నాను. అయితే నా అభిప్రాయాల్ని నా చుట్టూ ఉన్న కొందరు అనుమానించారు. ఇప్పుడీ నెక్లెస్ లు, ఆభరణాలు వేసుకోవడం అవసరమా? అని ప్రశ్నించారు. ఎహె, ఊరుకోండి, మనం కూడా ట్రై చేయకపోతే ఇంకెవరు చేస్తారు? లేదంటే ఇంకో ఇరవై ఏళ్లు కూడా ఇలాగే ఉంటుంది అని బదులిచ్చాను. నా జీవితంలో పెళ్లి అనేది ఒక ప్రత్యేక సందర్భం. అందుకే నాకు నచ్చినట్లుగా రెడీ అయ్యాను. అందుకు నేను చాలా హ్యపీగా ఉన్నాను. మగవాళ్లు ఇలా ఉండాలి? ఆడవాళ్లు ఇలా ఉండకూడదు? అని ఇతరులు నిర్ణయించాల్సిన పని, అవసరం లేదు. నేనేం చేయాలి? ఏం ధరించాలనేది నాకు మాత్రమే తెలుసు, ఇతరులు చెప్పనక్కర్లేదు’ అని అల్లు శిరీష్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

అల్లు శిరీష్- నైనికల పెళ్లి ఫొటోస్, వీడియోలు ఇదిగో..

View this post on Instagram

A post shared by Allu Sirish (@allusirish)

View this post on Instagram

A post shared by Allu Sirish (@allusirish)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us