అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆయనవిల్లి లంకలో ప్రజలను భయాందోళనకు గురిచేసిన ఓ మొసలి ఎట్టకేలకు జాలర్ల వలకు చిక్కింది. ఆరు నెలల క్రితం వరదల సమయంలో కొట్టుకువచ్చిన దానిని పట్టుకునేందుకు అటవీ అధికారులు అప్పట్లో విఫలమయ్యారు. చేపల వేటకు వెళ్ళిన జాలర్లకు అనూహ్యంగా వలలో పడటంతో వారు షాక్కు గురయ్యారు. అనంతరం అటవీ అధికారులు దానిని రిజర్వ్ ప్రాంతానికి తరలించారు.