Bhanupriya: నా అక్క భాను ప్రియా పిచ్చిది కాదు.. స్పందించిన శాంతిప్రియ
భానుప్రియ ఆరోగ్యం, మానసిక స్థితిపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఆమె సోదరి శాంతిప్రియ ఖండించారు. కొన్ని సినిమా వాగ్దానాలు నెరవేరకపోవడం, పాత్రలలో మార్పులు, భర్త మరణం వంటివి అక్కను బాధపెట్టాయని ఆమె వివరించారు. భానుప్రియ మానసిక సమస్యలతో బాధపడుతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని శాంతిప్రియ స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భానుప్రియ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వైరలవుతున్న రూమర్స్ పై ఆమె సోదరి శాంతిప్రియ స్పందించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శాంతిప్రియ మాట్లాడుతూ భానుప్రియ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కొన్ని సినిమాల విషయంలో ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం తన అక్క భాను ప్రియను మానసికంగా కుంగదీసిందని శాంతిప్రియ అన్నారు. తన అక్క భాను ప్రియ కొంతకాలంగా చాలా బాధలో ఉన్నారని.. కొన్ని సినిమాలు చేయమని ఆమెను సంప్రదించినప్పటికీ, చిత్రీకరణ సమయంలో పాత్రలలో చేసిన మార్పులు ఆమెను కలవరపరిచాయని శాంతిప్రియ చెప్పుకొచ్చారు. దాదాపు 280 సినిమాలు పూర్తి చేసి, ఎన్నో అవార్డులు గెలుచుకున్న వారిని అలా చూపించడం మర్యాదపూర్వకం కాదని.. వారిని ఆ పరిస్థితిలో చూడటం తనకు కూడా ఇష్టం లేదన్నారు శాంతి ప్రియ. తన అక్క భాను ప్రియ భర్త చనిపోయిన తర్వాత, తన అక్క కొంతకాలం కుంగిపోయారని.. ఇంట్లో నుంచి ఎక్కడికీ వెళ్లరని శాంతి ప్రియ చెప్పుకొచ్చింది. కానీ 80ల నాటి రియూనియన్‌కి ఆమెను ఇంకా ఎవరూ ఆహ్వానించలేకపోవడం తనను బాధించిందంటూ వివరించింది. అయితే ఈ విషయం గురించి ఎవరితోనూ మాట్లాడొద్దని తన అక్క తనతో చెప్పినప్పటికీ… తాను మాత్రం నిస్సంకోచంగా ఈ విషయాన్ని చెబుతున్నా అంటూ చెప్పింది శాంతి ప్రియ. అక్క నంబర్ తెలియకపోయినా.. సంప్రదింపు సమాచారం లేకపోయినా, తనకు కాల్ చేయాలని శాంతి ప్రియ చెప్పింది. లేదంటే.. తన అన్నయ్యకు ఫోన్ చేయవచ్చని.. ఇండస్ట్రీలో అందరికీ తన అన్నయ్య తెలుసంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు తన అక్క భాను ప్రియ ఇకపై సినిమాలు చేయదని.. కానీ తాను నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. ఇక చివరగా.. అక్క భాను ప్రియ మానసిక స్థితి సరిగే లేదంటూ జరిగే ప్రచారంలో వాస్తవం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తున్నవారిపై కూడా శాంతి ప్రియ సీరియస్ అయింది. తన అక్కకు మానసిక స్థితి సరిగా లేదంటూ ప్రచారం చేస్తే.. చర్య తీసుకుంటా అంటూ హెచ్చరించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Komarakka: ‘కొమురక్క తేడా గాడు..’ సాక్ష్యాలతో సంచలన ఆరోపణలు చేసిన అసిస్టెంట్
Ramayana: 4000 కోట్ల రూపాయల అద్భుతం: ‘రామాయణ’ గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ
రామాయణ Vs ఆదిపురుష్… తప్పు దిద్దుకుంటారా ??
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
నా లవర్తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
ప్రాణం పోసిన స్నేక్ క్యాచర్కు నాగుపాము కృతజ్ఞత..
మళ్లీ కట్టెల పొయ్యిలపై వంటలు.. బయో గ్యాస్కూ పెరిగిన డిమాండ్ !!
ఇంతందంగా ఉన్నావే.. నెలవంకలా భూమి
క్రికెట్ మ్యాచ్లో వివాదం.. కత్తిపోట్లతో యువకుడి మృతి
మీర్రా దొంగలంటే.. స్టేషన్ ముందు షాపునే కొల్లగొట్టేశారు

