ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
మన చుట్టూ ఉండే టాక్సిక్ వ్యక్తులు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతారని తాజా అధ్యయనం వెల్లడించింది. నెగటివ్ సంబంధాలు దీర్ఘకాలిక ఒత్తిడికి, హార్మోన్ల మార్పులకు దారితీసి, శారీరక కణాల నష్టం ద్వారా బయోలాజికల్ వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయి. ఇది కేవలం శారీరకమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఆరోగ్యకరమైన జీవితం కోసం సానుకూల సంబంధాలను పెంచుకోవడం, టాక్సిక్ వ్యక్తులకు దూరంగా ఉండటం ముఖ్యం.
మన చుట్టూ ఉండే వ్యక్తులు మన ఆరోగ్యంపైన ప్రభావం చూపుతారని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. తాజా అధ్యయనం దీన్ని మరింత బలపరుస్తోంది. ఎప్పుడూ స్ట్రెస్ పెంచే నెగెటివ్ ధోరణితో ప్రవర్తించే టాక్సిక్ వ్యక్తులతో ఎక్కువ సమయం గడిపితే వృద్ధాప్యం త్వరగా వచ్చే అవకాశం ఉందని న్యూయార్క్ యూనివర్సిటీ పరిశోధన స్పష్టం చేసింది. సాధారణంగా మన పుట్టిన తేదీ ఆధారంగా చెప్పే వయసు క్రోనాలాజికల్ ఏజ్ కాగా, శరీర కణాల స్థితి ఆధారంగా చెప్పే వయస్సును బయోలాజికల్ ఏజ్ అంటారు. ఇది ఆరోగ్య పరిస్థితిని ప్రతిబింబిస్తుందన్న మాట. ఒక వ్యక్తి జీవితంలో అత్యంత సన్నిహితంగా ఎవరైనా టాక్సిక్ వ్యక్తి ఉంటే వృద్ధాప్య వేగం సుమారు 1.5% పెరుగుతుంది. ముఖ్యంగా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఉన్న నెగటివ్ సంబంధాలు శరీరంపై ఎక్కువ ప్రభావం చూపాయని పరిశోధకులు గుర్తించారు. టాక్సిక్ వ్యక్తులు దీర్ఘకాలిక ఒత్తిడి లేదా క్రానిక్ స్ట్రెస్‌కు కారణమవుతారు. దీనివల్ల కార్టిసోల్ వంటి హార్మోన్లు పెరిగి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది కణాల నష్టం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి వాటికి కారణమై అంతిమంగా వేగవంతమైన వృద్ధాప్యానికి కారణమవుతుంది. టాక్సిక్ వ్యక్తులతో ఎక్కువ సమయం గడపడం వల్ల కేవలం శరీర ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఆందోళన, నిరాశ, భావోద్వేగ అలసట వంటి మానసిక సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో నిద్రలేమి, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు కూడా మీద పడవచ్చు. మన చుట్టూ ఉన్న సంబంధాలు భావోద్వేగాలపై అంతిమంగా శరీర వృద్ధాప్య ప్రక్రియపై ప్రభావం చూపుతాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. మంచి సంబంధాలు కలిగి, మద్దతు ఇచ్చే వ్యక్తులతో కలిసి జీవించడం ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించాలంటే టాక్సిక్ వ్యక్తులతో సంబంధాలను తగ్గించుకుని సానుకూల సంబంధాలను పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యం. నెగటివ్ ఆలోచనలతో ఉండే వ్యక్తులకు దూరంగా ఉండడం, అవసరమైన చోట హద్దులు గీయడం, వ్యాయామం, ధ్యానం తో ఒత్తిడిని తగ్గించుకోవాలని, సానుకూల ఆలోచనలు కలిగిన వ్యక్తులతో ఎక్కువ సమయం గడపాలని సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
ప్రాణం పోసిన స్నేక్ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత.. ఏం చేసిందో చూడండి
మళ్లీ కట్టెల పొయ్యిలపై ప్రజల వంటలు.. బయో గ్యాస్‌కూ పెరిగిన డిమాండ్ !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

