AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంతందంగా ఉన్నావే.. నెలవంకలా భూమి

ఇంతందంగా ఉన్నావే.. నెలవంకలా భూమి

Phani CH
|

Updated on: Apr 06, 2026 | 6:07 PM

Share

నాసా ఆర్టెమిస్-2 మానవసహిత చంద్రయాత్ర కీలక దశకు చేరింది. ఒరియన్ వ్యోమనౌక భూకక్ష్యను దాటి చంద్రుడి వైపు ప్రయాణిస్తోంది. వ్యోమగాములు భూమి అద్భుత ఫోటోలను తీశారు. సోమవారం 'లూనార్ ఫ్లైబై'తో చంద్రుడి అదృశ్య భాగాన్ని అన్వేషిస్తారు. ఈ పది రోజుల మిషన్ ఏప్రిల్ 10న పసిఫిక్ మహాసముద్రంలో ముగుస్తుంది, జాబిల్లిపై కొత్త సమాచారాన్ని అందిస్తుంది.

ఐదు దశాబ్దాల తర్వాత నాసా చేపట్టిన మానవసహిత చంద్రుడి యాత్ర కీలక దశnaకి ప్రవేశించింది. నాసా ఆర్టెమిస్‌-2 మిషన్‌లో నలుగురు వ్యోమగాములతో బయల్దేరిన ఒరియన్‌ వ్యోమనౌక భూకక్ష్యలో 25 గంటలు గడిపింది. ఆ తర్వాత భూకక్ష్యను విజయవంతంగా దాటి చందమామ దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఇక, భూమికి సంబంధించి వ్యోమగాములు తీసిన అద్భుత ఫోటోలను నాసా షేర్ చేసింది. అందులో భూమి నెలవంకలా కనువిందు చేస్తోంది. ఈ యాత్రలో కీలకమైన ‘లూనార్‌ ఫ్లైబై’ దశ సోమవారం జరగనుంది. ఆ విన్యాసంతో వ్యోమనౌక జాబిల్లి ఆవలి వైపున 6,400 కిలోమీటర్లు దూరం వెళుతుంది. దీంతో ఇప్పటి వరకూ మనం చూడని చంద్రుడి రెండో భాగాన్ని వ్యోమగాములు కెమెరాల్లో బంధిస్తారు. ఈ ప్రయాణంలో సుమారు ఆరో రోజున, ఓరియన్ వ్యోమనౌక చంద్రుడిని దాటి వెళుతున్న సమయంలో వ్యోమగాములు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూస్తారు. ఆ సమయంలో వారి దృక్కోణంలో చందమామ కొద్దిసేపు సూర్యుడ్ని పూర్తిగా అడ్డుకుంటుంది. జాబిల్లి కక్ష్య చుట్టూ ప్రయాణం పూర్తయిన తర్వాత భూమి దిశగా వచ్చి ఏప్రిల్ 10న పసిఫిక్‌ మహాసముద్రంలో క్యాప్సూల్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి నాసా గురువారం ఓరియన్ క్యాప్సూల్ ప్రయోగించింది. ఇది జాబిల్లి వైపు దూసుకెళ్తోంది. చంద్రుడి ఉపరితలానికి ఇది అత్యంత సమీపంగా వెళ్లి, దాని కక్ష్యను చుట్టి వస్తుంది. పది రోజుల ఈ మిషన్‌లో చందమామ అవతలివైపు ఎలా ఉందో తెలుసుకుంటారు. ఆర్టెమిస్‌-2 యాత్రలో ముగ్గురు అమెరికన్లు, ఒక కెనడా వ్యోమగామి ఉన్నారు. జాబిల్లిపై దిగకుండానే సుదూరం నుంచే వీరు చుట్టి వస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్రికెట్ మ్యాచ్‌లో వివాదం.. కత్తిపోట్లతో యువకుడి మృతి

Weather Update: తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న తుఫాను ముప్పు

Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇవాళ ధర ఎంతంటే ??

చీమలే ఆహారంగా.. శత్రుదేశంలో అమెరికా పైలట్‌ దుస్థితి

మీర్రా దొంగలంటే.. స్టేషన్ ముందు షాపునే కొల్లగొట్టేశారు

Follow Us