Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇవాళ ధర ఎంతంటే ??
అంతర్జాతీయ ఉద్రిక్తతలు, బలపడుతున్న డాలర్‌తో పెట్టుబడిదారులు డాలర్ ఆధారిత ఆస్తుల వైపు మళ్లడంతో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ఏప్రిల్ 6న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,800 తగ్గి రూ.1,49,130కి చేరింది. ఇరాన్ యుద్ధ ప్రభావం తక్కువగా ఉంది. కొనే ముందు నేటి ధరలను సరిచూసుకోండి. బంగారం ధరలు శాంతించాయి. గత కొంత కాలంగా భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేల చూపులు చూశాయి.
బంగారం ధరలు శాంతించాయి. గత కొంత కాలంగా భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేల చూపులు చూశాయి. అంతర్జాతీయంగా నెలకున్న ఉద్రిక్తతలతో డాలర్ విలువ పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు డాలర్ ఆధారిత ఆస్తుల మీదకు పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. సాధారణంగా వార్ ప్రభావంతో బంగారం ధరలు పెరగాలి. అయితే ఈ సారి అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఇరాన్ యుద్ధ ప్రభావం బంగారం ధరల మీద అంతగా ప్రభావం చూపడం లేదని చెప్పవచ్చు. ఏప్రిల్ 6 సోమవారం ధరలను చూస్తే బంగారం ధర భారీగానే తగ్గిందని చెప్పవచ్చు. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,800 తగ్గి, రూ.1,49,130 చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,650 తగ్గి, రూ.1,36,700 పలుకుతోంది. వెండి ధర స్థిరంగా కొనసాగుతూ..కేజీ వెండి రూ.2,55,000 గా కొనసాగుతోంది. దేశంలోని వివధ నగరాల్లో ఏప్రిల్ 6 సోమవారం బంగారం వెండిధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,280 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,36,850 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,49,130 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,36,700 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,660 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం రూ.1,38,100 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,130 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,700 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,55,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీర్రా దొంగలంటే.. స్టేషన్ ముందు షాపునే కొల్లగొట్టేశారు
అరె ఏందిరా ఇది.. అది బైకా.. బస్సా..!
తాళి కట్టబోతుండగా పెళ్లి ఆపిన వధువు.. రియల్ హీరోగా వరుడు..
వెనక్కి తగ్గిన కేంద్రం.. విమానాల్లో ఉచిత సీట్ల ఎంపికపై బ్రేక్
‘అన్‌స్టాపబుల్’.. ఇరాన్ పై సీఐఏ షాకింగ్ రిపోర్ట్
ట్రెక్కర్ల ఆహారంలో బేకింగ్ సోడా కలిపి.. ఎవరెస్ట్‌పై రూ.186 కోట్ల
ఒకే ఒక్కడు.. అణుబాంబు మీద పడ్డా ప్రాణాలతో ..

