AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీర్రా దొంగలంటే.. స్టేషన్ ముందు షాపునే కొల్లగొట్టేశారు

మీర్రా దొంగలంటే.. స్టేషన్ ముందు షాపునే కొల్లగొట్టేశారు

Phani CH
|

Updated on: Apr 06, 2026 | 5:11 PM

Share

ప్రకాశం జిల్లా అద్దంకిలోని ప్రముఖ ఆకృతి బట్టల షోరూంలో రూ.5 లక్షల దొంగతనం జరిగింది. పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఈ ఘటన జరగడం సంచలనం రేపింది. దుండగుడు పక్కా ప్లాన్‌తో పైకప్పు కట్ చేసి లోపలికి ప్రవేశించి, క్యాష్‌డ్రాలో ఉన్న నగదును ఎత్తుకెళ్లాడు. సీసీటీవీలో నిందితుడి దృశ్యాలు రికార్డయ్యాయి. అద్దంకి పోలీసులు, ఒంగోలు క్రైమ్ టీం దర్యాప్తు ముమ్మరం చేశాయి.

ప్రకాశం జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. పోలీస్‌ స్టేషన్‌కి సమీపంలోనే, నిరంతరం నిఘా ఉండే ప్రాంతంలోనే దొంగలు తమ ప్రతాపం చూపించారు. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉన్న ప్రముఖ ‘ఆకృతి’ బట్టల షోరూంను టార్గెట్ చేసి, లక్షలాది రూపాయల నగదుతో ఉడాయించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పక్కా ప్లాన్‌తో వచ్చిన దుండగుడు, షోరూం పైభాగంలో ఉన్న రేకుల షెడ్డును కట్ చేసి లోపలికి ప్రవేశించాడు. సీసీ ఫుటేజీలో రికార్డయిన దృశ్యాల ప్రకారం.. తెల్లటి దుస్తులు, తలకు టోపీ ధరించిన ఓ వ్యక్తి షోరూం అంతా కలియదిరిగాడు. నేరుగా క్యాష్ కౌంటర్ వద్దకు చేరుకుని, క్యాష్‌డ్రాలో ఉన్న సుమారు 5 లక్షల రూపాయల నగదును బ్యాగులో సర్దుకుని వచ్చిన దారినే పరారయ్యాడు. ఉదయం షోరూం తెరిచిన సిబ్బంది, కౌంటర్ చెల్లాచెదురుగా ఉండటం చూసి షాకయ్యారు. యజమాని ఫిర్యాదుతో అద్దంకి పోలీసులు రంగంలోకి దిగారు. స్టేషన్ రోడ్డులో అర్ధరాత్రి కూడా వాహనాల రాకపోకలు ఉన్నప్పటికీ, ఇంత సాహసానికి ఒడిగట్టడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఒంగోలు నుంచి క్రైమ్ బ్రాంచ్, క్లూస్ టీమ్‌ను పిలిపించి వేలిముద్రలు సేకరించారు. ఈ చోరీ వెనుక పాత నేరస్తుల హస్తం ఉందా లేక లోపలి వ్యక్తులు ఎవరైనా సహకరించారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Biker Review: రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు

కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా

వేసవిలో బంగాళాదుంపలు తింటున్నారా.. జాగ్రత్త

ఓర్నీ.. విమానంలో ఉన్నప్పుడు.. నీకిదేం పోయేకాలం రా

అబ్బా.. ఈ కోతి ఎంత మంచిదో.. దీని సంస్కారానికి ఫిదా అవుతున్న నెటిజన్లు

Follow Us