AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biker Review:  రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు

Biker Review: రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు

Phani CH
|

Updated on: Apr 03, 2026 | 9:23 PM

Share

శర్వానంద్ 'బైకర్' మోటోక్రాస్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామా. ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా సాగే ఈ సినిమా రేసింగ్ థ్రిల్స్‌తో ఆకట్టుకుంటుంది. శర్వానంద్ అంకితభావం, డా. రాజశేఖర్ బలమైన కంబ్యాక్ సినిమాకు ప్రధాన బలం. జిబ్రాన్ సంగీతం, కెమెరా వర్క్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. కొత్త అనుభూతిని కోరుకునే వారికి ఇది చూడదగిన చిత్రం.

తెలుగు ప్రేక్షకులకు స్పోర్ట్స్ డ్రామాలు కొత్త కాకపోయినా, ‘మోటోక్రాస్’ బ్యాక్ డ్రాప్ లో రావడం మాత్రం ఖచ్చితంగా కొత్తే. సరిగ్గా ఈ పాయింట్ పట్టుకున్నప్పుడే శర్వానంద్ సగం సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు. ‘బైకర్’ కచ్చితంగా మనం రెగ్యులర్‌గా చూసే కమర్షియల్ సినిమా కాదు.. ప్రేక్షకులకు ఓ కొత్త ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా ఇస్తుంది. దర్శకుడు అభిలాష్ రెడ్డి ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీని చాలా పక్కాగా సెటప్ చేసుకున్నాడు. డిటైలింగ్ కోసం కాస్త టైమ్ తీసుకోవడం వల్ల అక్కడక్కడా కాస్త స్లో నేరేషన్ అనిపిస్తుంది. కానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ కి వచ్చేసరికి కథను పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసి క్యూరియాసిటీ పెంచాడు. ఇక కీలకమైన సెకండ్ హాఫ్ అంతా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా సాగుతుంది. నిజానికి ఇది చిన్న కథే అయినా, మోటోక్రాస్ బ్యాక్ డ్రాప్ అనేసరికి విపరీతమైన ఆసక్తి రేపుతుంది. ముఖ్యంగా రేసింగ్ సీన్స్, అవి చూస్తున్నప్పుడు వచ్చే జిబ్రాన్ సౌండ్.. ఆ సౌండ్ డిజైనింగ్.. సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. ఇక శర్వానంద్, మాళవిక నాయర్ మధ్య నడిచే ట్రాక్ ప్రేక్షకులకు కాస్త ‘జెర్సీ’ సినిమా వైబ్స్ ను గుర్తు చేస్తుంది. ఇవన్నీ పక్కకు పెడితే.. క్లైమాక్స్ ఎమోషన్స్ మాత్రం గుండెను హత్తుకునేలా బలంగా వర్కౌట్ అయ్యాయనే చెప్పొచ్చు. ఈ క్యారెక్టర్ కోసం శర్వానంద్ అక్షరాలా తన ప్రాణం పెట్టేసాడు. పర్ఫెక్ట్ రేసర్‌లా కనిపించడానికి అతను పడ్డ కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మేజర్ హైలైట్ మాత్రం డా. రాజశేఖర్ క్యారెక్టర్. ఒక రకంగా ఈయనే ఈ సినిమాకు ప్రాణం పోశాడని చెప్పొచ్చు. రాజశేఖర్‌కు ఇది కచ్చితంగా సాలిడ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఓ మంచి సినిమాతో మొదలైంది. మాళవిక నాయర్ పాత్ర కూడా బాగుంది. మిగిలిన పాత్రలన్నీ కథకు తగ్గట్లుగా ఉన్నాయి. ఇక జిబ్రన్ సంగీతం ఈ సినిమాకు మేజర్ ప్లస్. తన నేపథ్య సంగీతంతో జిబ్రాన్ ఎమోషనల్ సీన్స్ బాగా ఎలివేట్ చేశాడు. అలాగే రేసింగ్ ట్రాక్స్, నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఒక కొత్త పాయింట్‌తో ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేస్తూ చాలా కొత్తగా ట్రై చేశాడు. కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రేసింగ్ సీన్స్ అదిరిపోయేలా డిజైన్ చేసారు. ఇక ఓవరాల్‌గా బైకర్ గురించి చెప్పాలంటే.. ఎంగేజింగ్ రేసింగ్ సినిమా విత్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటి జర్నీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా

వేసవిలో బంగాళాదుంపలు తింటున్నారా.. జాగ్రత్త

ఓర్నీ.. విమానంలో ఉన్నప్పుడు.. నీకిదేం పోయేకాలం రా

అబ్బా.. ఈ కోతి ఎంత మంచిదో.. దీని సంస్కారానికి ఫిదా అవుతున్న నెటిజన్లు

బిర్యానీలో లెగ్ పీస్‌లు లేవని.. పెళ్లి పందిట్లో విరిగిన కుర్చీలు

Follow Us