బిర్యానీలో లెగ్ పీస్‌లు లేవని.. పెళ్లి పందిట్లో విరిగిన కుర్చీలు
ఉత్తరప్రదేశ్‌లో ఓ పెళ్లిలో బిర్యానీలో చికెన్ లెగ్ పీస్ లేదన్న చిన్న కారణంతో బంధువులు కుర్చీలతో కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. గతంలో కేరళలో అప్పడం కోసం ఇదే తరహా ఘర్షణ జరిగింది. ఇలా చిన్నపాటి ఆహార కారణాలకే పెళ్లి వేడుకలు రసాభాసగా మారడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, ఇలాంటి చర్యలు మంచిది కాదని కామెంట్స్ చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో ఒక పెళ్లి వేడుక చిన్నపాటి యుద్ధాన్ని తలపించింది. బిర్యానీలో చికెన్ లెగ్ పీస్ వడ్డించలేదన్న చిన్న కారణంతో బంధువులు ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడి చేసుకున్నారు. అమ్రోహా జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమ్రోహాలోని ఒక వెడ్డింగ్ హాల్‌లో వివాహ విందు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కొందరు అతిథులకు వడ్డించిన బిర్యానీలో లెగ్ పీసులు లేకపోవడంతో వారు క్యాటరింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో పరిస్థితి చేయి దాటింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఇరువర్గాల వారు అక్కడున్న ప్లాస్టిక్ కుర్చీలను ఒకరిపై ఒకరు విసురుకోవడం ప్రారంభించారు. ఈ గొడవతో పెళ్లికి వచ్చిన మిగతా వారు భయంతో బయటకు పరుగులు తీశారు. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఈ దాడిలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. కేవలం ఒక చికెన్ ముక్క కోసం పెళ్లి వేడుకలో ఇంతటి గొడవ జరగడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. గతంలోనూ ఇటువంటి ఘటనలు వివాహ వేడుకల సమయంలో చాలా జరిగాయి. కేరళ రాష్ట్రం అలప్పుజా జిల్లాలో ఒక పెళ్లిలో ఒక అప్పడం కారణంగా ఊహించనంత పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది. వరుడి స్నేహితులు ఎక్స్ ట్రా అప్పడం అడగగా.. అమ్మాయి తరపు బంధువు నో చెప్పడంతో పెద్ద గొడవ జరిగింది. వాగ్వాదం ప్రారంభమైన తర్వాత అది క్రమంగా తీవ్రమైన కొట్లాటగా మారింది. అప్పడం కోసం ఒకరినొకరు తన్నుకోవడం, పిడికిలి బిగించి బలంగా కొట్టడమే కాకుండా, వడ్డించే గిన్నెలు, బక్కెట్లతోనూ దాడులు చేసుకున్నారు. కుర్చీలు, బల్లలు కూడా ఒకరిపై ఒకరు విసురుకునే స్థాయికి ఫైటింగ్ జరిగింది .ఇక ఈ వ్యవహారంలో అలప్పుజా పోలీసుల జోక్యం చేసుకుని 10 మందిపై కేసు నమోదు చేశారు. ఇలా ఓ పక్కన పెళ్లి జరుగుతుంటే చికెన్ ముక్క కోసం, నల్లి బొక్క కోసం కొట్టుకుని చచ్చిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ఏది ఏమైనా చిన్నచిన్న కారణాలకే కలకాలం గుర్తుండిపోవాల్సిన పెళ్లి వేడుకలో ఇలా రచ్చ రచ్చ చేయడం మంచిది కాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెల్ఫీలు దిగుతూ తెగ మురిసిపోయిన కొండముచ్చు..
అమ్మో.. మళ్లీ కరోనా !! దేశానికి మరోసారి కొవిడ్ ముప్పు
పట్టపగలే ఆకాశంలో చీకట్లు.. భయపెట్టిన కాకుల గుంపు.. వినాశనానికి సంకేతమా
ఇంటి బాధ్యత నాపైనే ఉంది.. నేను చదువుకోవాలి సార్
జాబిల్లి చెంతకు ‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములతో పాటు చిన్నారి ‘బొమ్మ’
బిర్యానీలో లెగ్ పీస్‌లు లేవని.. పెళ్లి పందిట్లో విరిగిన కుర్చీలు
సెల్ఫీలు దిగుతూ తెగ మురిసిపోయిన కొండముచ్చు..
పట్టపగలే ఆకాశంలో చీకట్లు.. భయపెట్టిన కాకుల గుంపు..
ఇంటి బాధ్యత నాపైనే ఉంది.. నేను చదువుకోవాలి సార్
కిరాణా వ్యాపారికి ఫోన్ పే పేరుతో కుచ్చుటోపీ.. ఏం జరిగిందంటే
అలర్ట్..ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా?
బాబోయ్.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!

