AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బా.. ఈ కోతి ఎంత మంచిదో.. దీని సంస్కారానికి ఫిదా అవుతున్న నెటిజన్లు

అబ్బా.. ఈ కోతి ఎంత మంచిదో.. దీని సంస్కారానికి ఫిదా అవుతున్న నెటిజన్లు

Phani CH
|

Updated on: Apr 03, 2026 | 6:50 PM

Share

ప్రకాశం జిల్లా సింగరకొండ ఆలయంలో ఒక ప్రత్యేకమైన వానరం భక్తుల ప్రేమను గెలుచుకుంది. సాధారణ కోతుల్లా కాకుండా, ఇది బలవంతంగా కాకుండా ఎవరైనా ప్రేమగా ఇస్తేనే ఆహారం తీసుకుంటుంది. ఒక భక్తుడు ఇచ్చిన గారెను సంస్కారవంతంగా తింటున్న ఈ వానరం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సాక్షాత్తు హనుమంతుడే నైవేద్యం స్వీకరిస్తున్నాడని భక్తులు మురిసిపోతున్నారు.

అల్లరి చేష్టలకు మారుపేరు కోతి. ఇటీవల ఆహారం కోసం వనాలను వదిలి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. దారిన వెళ్లేవారిపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు చాలా చూశాం. అలాగే ఆలయాల దగ్గర ఉండే వానరాలు భక్తుల చేతుల్లోని పదార్ధాలను లాక్కెళ్లిపోయి భక్తులను ముప్పు తిప్పలు పెడుతుంటాయి. అలాంటిది ఓ వానరం మాత్రం వీటన్నిటికీ భిన్నంగా వ్యవహరిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అబ్బ.. ఈ కోతి ఎంత మంచిదో అనిపించుకుంటోంది. ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధిలో ఓ వానరం ఎంతో సంస్కారవంతంగా ఆహారం తీసుకుంటున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సింగరకొండ క్షేత్రం వానరాలకు నిలయం. ఇక్కడ భక్తులు ఇచ్చే ప్రసాదాల కోసం కోతులు గుంపులుగా వస్తుంటాయి. అయితే, మిగతా కోతుల్లా కాకుండా ఈ ప్రత్యేక వానరం భక్తుల చేతుల్లో నుంచి ఏదీ లాక్కోదు. ఎవరైనా ప్రేమతో ఇస్తేనే తీసుకుంటుంది, అది కూడా తెగ మొహమాటపడిపోతూ తీసుకుంటుంది. తాజాగా ఒక భక్తుడు ఇచ్చిన పెద్ద సైజు గారెను రెండు చేతులతో పట్టుకుని, ప్రహరీ గోడపై దర్జాగా కూర్చుని ఎంతో నిమ్మళంగా ఆరగిస్తున్న దృశ్యం భక్తులను కట్టిపడేసింది. ఈ వానరం గారెను తింటున్న తీరు చూస్తుంటే, సాక్షాత్తు ఆ హనుమంతుడే భక్తులు పెట్టిన నైవేద్యాన్ని స్వీకరిస్తున్నాడా అన్నట్లుగా ఉందని భక్తులు మురిసిపోతున్నారు. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా, ఎంతో ప్రశాంతంగా తనకు దొరికి ఆహారం తింటూ ఎంతో బుద్ధిగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటోంది. గారెను తింటున్న కోతి వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిర్యానీలో లెగ్ పీస్‌లు లేవని.. పెళ్లి పందిట్లో విరిగిన కుర్చీలు

సెల్ఫీలు దిగుతూ తెగ మురిసిపోయిన కొండముచ్చు..

అమ్మో.. మళ్లీ కరోనా !! దేశానికి మరోసారి కొవిడ్ ముప్పు

పట్టపగలే ఆకాశంలో చీకట్లు.. భయపెట్టిన కాకుల గుంపు.. వినాశనానికి సంకేతమా

ఇంటి బాధ్యత నాపైనే ఉంది.. నేను చదువుకోవాలి సార్‌

Follow Us