AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓర్నీ.. విమానంలో ఉన్నప్పుడు.. నీకిదేం పోయేకాలం రా

ఓర్నీ.. విమానంలో ఉన్నప్పుడు.. నీకిదేం పోయేకాలం రా

Phani CH
|

Updated on: Apr 03, 2026 | 6:53 PM

Share

బెంగళూరు-వారణాసి ఇండిగో విమానంలో మహ్మద్ అద్నాన్ అనే ప్రయాణికుడు అత్యవసర ద్వారం తెరవడానికి ప్రయత్నించాడు. గాల్లో ఉన్నప్పుడు, ల్యాండింగ్ సమయంలో రెండుసార్లు ఈ చర్యకు పాల్పడటంతో పైలట్ ల్యాండింగ్ రద్దు చేసి 'గో-అరౌండ్' చేశాడు. విమానం సురక్షితంగా దిగింది, ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ అప్పగించారు. ఈ ఘటనపై ఉగ్రవాద వ్యతిరేక బృందం దర్యాప్తు చేస్తోంది, భద్రతా ఉల్లంఘన తీవ్రంగా ఉంది.

ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ప్రయాణికుల గుండెలు ఆగిపోయినంత పని అయింది. ఒక యువకుడు చేసిన పనికి పైలట్ ల్యాండింగ్‌ను రద్దు చేసి, విమానాన్ని తిరిగి గాల్లోకి తీసుకెళ్లాల్సి వచ్చింది. బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానం లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాకు చెందిన మహ్మద్ అద్నాన్ అనే ప్రయాణికుడు విమానం గాల్లో ఉండగానే ఒక్కసారిగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకుని, హెచ్చరించి సీటు మార్చారు. అయితే, విమానం వారణాసి విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి కొద్ది నిమిషాల ముందు.. అద్నాన్ మళ్ళీ అదే పిచ్చిపని చేశాడు. ప్రయాణికుడు రెండోసారి డోర్ తీసేందుకు ప్రయత్నించడంతో ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్, అత్యంత వేగంగా స్పందించారు. భద్రతా కారణాల దృష్ట్యా ల్యాండింగ్‌ను తక్షణమే నిలిపివేసి, విమానాన్ని తిరిగి గాల్లోకి పంపే “గో-అరౌండ్” ప్రక్రియను చేపట్టారు. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి సద్దుమణిగడంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్ అనంతరం సిబ్బంది నిందితుడిని సీఐఎస్ఎఫ్ కు అప్పగించారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, విచారించగా అద్నాన్ చెప్పిన సమాధానాలు విని అధికారులు విస్తుపోయారు. అతనికి ఆ సమయంలో ఏం జరిగిందో తెలియదని, తాను దెయ్యం పట్టినట్లు ప్రవర్తించాను అంటూ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లుగా సమాచారం. ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో యాంటీ-టెర్రరిజం స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా లోతుగా దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అబ్బా.. ఈ కోతి ఎంత మంచిదో.. దీని సంస్కారానికి ఫిదా అవుతున్న నెటిజన్లు

బిర్యానీలో లెగ్ పీస్‌లు లేవని.. పెళ్లి పందిట్లో విరిగిన కుర్చీలు

సెల్ఫీలు దిగుతూ తెగ మురిసిపోయిన కొండముచ్చు..

అమ్మో.. మళ్లీ కరోనా !! దేశానికి మరోసారి కొవిడ్ ముప్పు

పట్టపగలే ఆకాశంలో చీకట్లు.. భయపెట్టిన కాకుల గుంపు.. వినాశనానికి సంకేతమా

Follow Us