AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ కట్టెల పొయ్యిలపై ప్రజల వంటలు.. బయో గ్యాస్‌కూ పెరిగిన డిమాండ్‌ !!

మళ్లీ కట్టెల పొయ్యిలపై ప్రజల వంటలు.. బయో గ్యాస్‌కూ పెరిగిన డిమాండ్‌ !!

Phani CH
|

Updated on: Apr 06, 2026 | 6:10 PM

Share

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర గ్యాస్ కొరత సామాన్యులను, వ్యాపారస్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్లు సకాలంలో అందక, హోటళ్లు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నాయి, కట్టెల ధరలు విపరీతంగా పెరిగాయి. కేటరింగ్‌ నిర్వాహకులు బయోగ్యాస్‌కు మారారు. ఈ సంక్షోభం గృహిణులతో పాటు హోటల్ ధరలపైనా ప్రభావం చూపుతోంది. యుద్ధప్రాతిపదికన గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా గ్యాస్ కొరత సామాన్యులను, వ్యాపారస్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందకపోవడంతో వంట గదుల్లో పొయ్యి వెలగడంలేదు. గ్యాస్ కోసం వారాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి రావడంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు జనం మొగ్గు చూపుతున్నారు. గ్యాస్ దొరకని పరిస్థితుల్లో హోటళ్లు, కేటరింగ్ నిర్వాహకులు తిరిగి పాతకాలపు కట్టెల పొయ్యల వైపు మళ్లుతున్నారు. దీంతో కట్టెలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. గతంలో రూ. 1000 నుంచి రూ. 1500 పలికే కట్టెల మోపు ధర ఇప్పుడు ఏకంగా రూ. 4000 నుంచి రూ. 5000 వరకు పలుకుతోంది. కట్టెల పొయ్యిపై వంట చేయడం వల్ల సమయం వృథా అవ్వడమే కాకుండా శ్రమ కూడా పెరుగుతోందని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ సత్యా అందిస్తారు. గ్యాస్ కొరత కారణంగా చాలా చోట్ల కర్రీ పాయింట్లు, హోటళ్లు మూతపడ్డాయి. ఫంక్షన్ల ఆర్డర్లు తీసుకున్న కేటరింగ్ నిర్వాహకులు చేసేదేమీ లేక CNG బయోగ్యాస్ ఉత్పత్తులను వాడుతున్నారు. మార్కెట్లో 14 కేజీల బయోగ్యాస్ సిలిండర్ ధర రూ. 900 నుంచి రూ. 1000 వరకు పలుకుతోంది. జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. గ్యాస్ కొరత ప్రభావం సామాన్య గృహిణులపైనే కాకుండా, పరోక్షంగా హోటల్ ధరల పెరుగుదలపై కూడా పడుతోంది. అధికారులు తక్షణమే స్పందించి గ్యాస్ ఏజెన్సీలతో మాట్లాడి నిల్వలను అందుబాటులోకి తేవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంతందంగా ఉన్నావే.. నెలవంకలా భూమి

క్రికెట్ మ్యాచ్‌లో వివాదం.. కత్తిపోట్లతో యువకుడి మృతి

Weather Update: తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న తుఫాను ముప్పు

Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇవాళ ధర ఎంతంటే ??

చీమలే ఆహారంగా.. శత్రుదేశంలో అమెరికా పైలట్‌ దుస్థితి

Follow Us