AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana: 4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ

Ramayana: 4000 కోట్ల రూపాయల అద్భుతం: ‘రామాయణ’ గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ

Phani CH
|

Updated on: Apr 06, 2026 | 8:31 PM

Share

భారతీయ చలనచిత్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ₹4000 కోట్లతో 'రామాయణ' చిత్రం రూపుదిద్దుకుంటోంది. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని, 190 దేశాల్లో, 50 భాషల్లో విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. AI టెక్నాలజీని ఉపయోగించి డబ్బింగ్, డి-రిస్కింగ్ వ్యూహాలతో బడ్జెట్ రిస్కులను తగ్గించుకుంటున్నారు. ప్రపంచ స్థాయిలో భారతీయ సినిమా సత్తాను చాటడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం.

ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద వచ్చిన హయ్యస్ట్ కలెక్షన్సే 2000 కోట్లు. ఇప్పటికీ 99 పర్సెంట్‌ సినిమాలు వంద కోట్ల మార్క్‌ను కూడా టచ్ చేయలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఓ ఇండియన్ సినిమా అది కూడా రూటెడ్ ఇండియన్ కథతో ఏకంగా 4000 కోట్లతో తెరకెక్కించటం అంటే మామూలు సాహసం కాదు. అలాంటి రిస్కే చేస్తోంది రామాయణ టీమ్‌. పలు హాలీవుడ్ సినిమాలకు వర్క్‌ చేసిన నమిత్‌ మల్హోత్రా ఈ సాహసం చేస్తున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు కనీ వినీ ఎరుగని రీతిలో దాదాపు ₹4,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ‘రామాయణ’ రూపొందుతోంది. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, గ్లోబల్ మార్కెట్‌లో భారతీయ సినిమా సత్తాను చూపించే ప్రయత్నం. ఆస్కార్ విజేత హ్యాన్స్ జిమ్మర్ సంగీతం, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ వంటి అంశాలు ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ఆడియన్స్‌కు కూడా చేరువ చేస్తున్నాయి. ఎన్ని హంగులు కూడా ఓ ఇండియన్ సినిమా 4000 కోట్ల బిజినెస్ చేయటం అన్నది సాధ్యమేనా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో మేకర్స్ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ప్రతీ రూపాయిని క్యాలెక్యులేటెడ్‌గానే ఖర్చు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌ హాలీవుడ్‌ సినిమాకు డి-రిస్కింగ్‌ అనే స్ట్రాటజీ ఫాలో అవుతారు. అంటే సినిమా రిలీజ్‌కు ముందే భారీ డీల్స్ కుదర్చుకోవటం, గ్లోబల్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ ద్వారా బడ్జెట్‌ పరంగా రిస్క్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. కేవలం థియేట్రికల్‌, నాన్ థియేట్రికల్ మార్గాల ద్వారానే కాకుండా.. వీలైనన్ని ఎక్కువ రంగాల నుంచి రెవెన్యూ సమకూర్చుకునే ప్రయత్నం చేస్తారు. టెక్నాలజీ పరంగానూ అప్‌గ్రేడ్ అవుతూ సినిమాను ప్రపంచ ఆడియన్స్‌కు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రామాయణ సినిమాను 190 దేశాల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇంపార్టెంట్‌ లాంగ్వేజెస్‌లో మ్యాన్వువల్‌గానే డబ్బింగ్ ప్రాసెస్ జరుగుతోంది. కొన్ని భాషల్లో ఏఐ ద్వారానే డబ్బింగ్ పనులు కానిచ్చేస్తున్నారు. ఇలా టెక్నాలజీ వాడటం ద్వారా ప్రపంచంలోని ప్రతీ ఆడియన్‌కు సినిమాను దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే జరిగితే ప్రపంచ స్థాయిలో ఎక్కువ భాషల్లో, ఎక్కువ దేశాల్లో, రిలీజ్ అయిన సినిమాగా రామాయణ రికార్డ్ క్రియేట్ చేయబోతోంది. డిజిటల్‌, శాటిలైట్‌ హక్కుల ద్వారా కూడా భారీ మొత్తం రికవర్‌ చేసేందుకు ప్రయత్నిస్తోంది రామాయణ టీమ్. దాదాపు 50 భాషల్లో రిలీజ్‌ అవుతుండటంతో అన్ని భాషల్లో డిజిటల్‌, శాటిలైట్ బిజినెస్‌ను రిలీజ్‌కు ముందే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఫ్రాంచైజీగా రాబోతున్న ఈ సినిమాతో ఇండియన్ మేకర్స్ స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పటంతో పాటు మన సినిమా టెక్నాలజీ, ఫైనాన్స్‌ స్టాండర్డ్స్‌ను కూడా గ్లోబల్ రేంజ్‌లో చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రామాయణ Vs ఆదిపురుష్… తప్పు దిద్దుకుంటారా ??

ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !

పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే

ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత.. ఏం చేసిందో చూడండి

మళ్లీ కట్టెల పొయ్యిలపై ప్రజల వంటలు.. బయో గ్యాస్‌కూ పెరిగిన డిమాండ్‌ !!

Follow Us