AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రజలకు బిగ్ రిలీఫ్‌.. బుక్ చేసిన 2-3 రోజుల్లోనే సిలిండర్ డెలివరీ.. ప్రభుత్వం కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇదో సూపర్ గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. బుక్ చేసుకున్న రెండు లేదా మూడు రోజుల్లోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటించింది. రాష్ట్రంలో ఎల్పీజీ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని.. బయట జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని స్పష్టం చేసింది.

ప్రజలకు బిగ్ రిలీఫ్‌.. బుక్ చేసిన 2-3 రోజుల్లోనే సిలిండర్ డెలివరీ.. ప్రభుత్వం కీలక ప్రకటన
Gas Cylinder Delivery
Anand T
|

Updated on: Apr 07, 2026 | 1:40 PM

Share

పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశంలో ఎల్పజీ గ్యాస్ కొతర ఏర్పడిన విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో చాలా నగరాల్లో గ్యాస్ లిండర్ల సరఫరా ఆలస్యం అవుతుంది. బుక్ చేసి దాదాపు 20 రోజులకు గానీ సిలిండర్ రాని పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఏపీ ప్రజలకు ఇక గ్యాస్ సిలిండర్ల కోసం వారాల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. గ్యాస్ బుక్‌ చేసిన రెండు మూడు రోజుల్లోనే సిలిండర్ ఇంటికి వస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని రిఫైనరీలలో ప్రస్తుతం 14, 000 టన్నుల LPG నిల్వలు ఉన్నాయని.. ప్రజలు ఎవరూ టెన్షన్ పడొద్దని స్పష్టం చేసింది.

ఫేక్ ప్రచారం నమ్మోద్దు

ఏపీలో పెట్రోల్, డీజిల్, గ్యాస్‌కు ఎలాంటి కొరతలేదని, అన్ని నిల్వలు తమ దగ్గర పుష్కలంగా ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో కొంతమంది పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అలాంటి వదంతులు ప్రజలు ఎవరూ నమ్మవద్దని తెలిపింది. అలాగే గ్యాస్ లేదని టెన్షన్ పడి ప్రజలు అనవసరంగా బుకింగ్స్ చేసుకోవద్దని తెలిపింది. గందరగోళంగా సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీలకు చుట్టూ తిరగవద్దని.. గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని పేర్కొంది.

గ్యాస్ సరఫరా విషయంలో సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను ఎవరూ నమ్మవద్దని.. ప్రభుత్వ అధికారుల నుంచి వచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే ప్రజలు పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మొదట కాస్త కొరత ఏర్పడినప్పటికి.. హర్మోజ్ నుంచి ఇండియాకు రావాల్సిన నౌకలపై ఇరాన్ ఆంక్షలు ఎత్తివేడంతో ఆ నౌకలు భారత్ చేరుకున్నాయి. దీంతో దేశంలో ఎల్పీజీ నిల్వలు పెరిగాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us