Hyderabad: ఆదివారం రూమ్ నుంచి బయటకు రాని యువతి.. ఫ్రెండ్ కిటికీలో తొంగి చూడగా
అమృత యూనివర్సిటీలో బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్న శ్వేత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆదివారం సెలవు రోజు అందరితో సరదాగా గడిపిన ఆమె, ఉన్నట్లుండి గదిలోకి వెళ్లి బలవన్మరణానికి పాల్పడింది. ఆ వివరాలు ఇలా ఓ సారి చూసేయండి.

ఆదివారం సెలవు కావడంతో విద్యార్థినులంతా సరదాగా గడుపుతున్నారు. ఉన్నట్లుండి తనకు ఒంటరిగా ఉండాలని ఉందని చెప్పి శ్వేత తన గదిలోకి వెళ్లింది. అయితే సాయంత్రం ఫోన్ చేసిన తల్లిదండ్రులకు శ్వేత నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఆమె స్నేహితురాలికి ఫోన్ చేసి శ్వేతతో మాట్లాడించాలని చెప్పారు. ఆమె వెళ్లి తలుపు కొట్టగా తీయలేదు. దీంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి తొంగి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ శ్వేత కనిపించింది. వెంటనే యూనివర్సిటీ సిబ్బందికి సమాచారం అందించగా రంగంలోకి దిగిన సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్వేత చనిపోయినట్లు వైద్యులు చెప్పారు.
ఇది చదవండి: గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా రిపేర్ చేసుకోవచ్చు..
హైదరాబాద్‌లోని నిజాంపేట ప్రాంతానికి చెందిన శ్వేత.. అమృత యూనివర్సిటీలో బీటెక్ నాలుగో ఏడాది చదువుతుంది. అందరితో సరదా ఉండే శ్వేత ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. అంతకముందు ఆమె రాసిన సూసైడ్ లేఖ ఆ రూంలో ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నన్ను క్షమించండి అంటూ లేఖ మొదలు పెట్టిన శ్వేత.. నా చావుకు ఎవరూ కారణం కాదు. ఎవరిని నిందించవద్దు.. నాకు బ్రతకాలని లేదు అంటూ సూసైడ్ లేఖలో రాసింది. నా కోసం ఎంతో చేసిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పింది. నా ఆత్మహత్యను ప్రచారం చేసి నా తల్లిదండ్రులకు బాధ కలిగించవద్దు అని వేడుకున్న ఆమె… ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పింది.
అమృతా యూనివర్సిటీలో విద్యార్థిని మరణంతో స్నేహితులు కన్నీరు పెట్టుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌లోని మార్చురీ వద్దకు చేరుకుని విషాదంలో మునిగిపోయారు. ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అర్దం కావడం లేదన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చదవండి: మిగిలిపోయిన సబ్బులతో ఇన్ని ఉపయోగాలా.? ఇది చూస్తే ఇంకెప్పుడూ పడెయ్యరు..
