ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగిడం మంచిదేనా? అసలు నిజాలు ఇవే!

17 August 2026

Anand T

చాలా మందికి ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. కానీ నిమ్మరసం ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీని తాగడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అవేంటో తెలుసుకోండి.

నిమ్మరసం

నిమ్మకాయలో ఉండే అధిక ఆమ్లత్వం, ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపి, దీర్ఘకాలంలో వాటిని బలహీనపరిచే ప్రమాదం ఉంది.

ఎముకల బలహీనత

నిమ్మరసంలోని ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని వల్ల పళ్ళపై ఉండే ఎనామిల్‌ను దెబ్బతిని దంత సమస్యలు రావచ్చు.

దంత సమస్యలు

నిమ్మలో ఉండే అధిక ఆస్కార్బిక్ యాసిడ్ మూత్రవిసర్జనను పెంచుతుంది. దీనివల్ల బాడీలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ బారీన పడవచ్చు.

డీహైడ్రేషన్

పొద్దున్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు.

ఎసిడిటీ

నిమ్మకాయ నీరు మూత్రవిసర్జనను ఎక్కువగా ప్రేరేపించడం కారణంగా ఇది కిడ్నీలపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.

కిడ్నీలపై ఒత్తిడి

నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా, కడుపుబ్బరం, గొంతులో మంట వంటి సమస్యలు రావచ్చు

గొంతు నొప్పి

కాబట్టి మీకు ఖాళీ కడుపుతో నిమ్మసరం తాగే అలవాటు ఉంటే.. దాన్ని వైద్యుల సలహాతో మితంగా మాత్రమే తీసుకోండి. ఎందుకంటే నిమ్మరసం అనేది మన ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ.. ఇది అందరికి ఒకేలాంటి ప్రయోజనాలను అందించలేదు. 

వైద్య సలహా