AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూపర్ సర్పంచ్ సాబ్.. బడికి.. ఇక సైకిల్‌పై..! పేద విద్యార్థుల నడక కష్టాలకు చెక్..

ప్రతిరోజూ బడికి వెళ్లాలంటే కిలోమీటర్ల కొద్దీ నడక..! ఉదయం ఇంటి నుంచి బయలుదేరితే.. తిరిగి ఇంటికి చేరే వరకు కాళ్లకు విశ్రాంతి ఉండదు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు రవాణా సౌకర్యం లేకపోవడంతో.. చదువుపై ఆసక్తి ఉన్నా నడక కష్టం వారి విద్యకు అడ్డంకిగా మారింది. వారి నడక కష్టాలను చూసి ఓ ప్రజాప్రతినిధి చలించిపోయారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా.. తన దాతృత్వంలోవారి నడక కష్టాలకు చెక్ పెట్టారు. ఓ ప్రజాప్రతినిధి తీసుకున్న చిన్న నిర్ణయం.. విద్యార్థుల జీవితాల్లో తెచ్చిన పెద్ద మార్పు. ఆ మార్పు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే

సూపర్ సర్పంచ్ సాబ్.. బడికి.. ఇక సైకిల్‌పై..! పేద విద్యార్థుల నడక కష్టాలకు చెక్..
Raghunathapalem Government School
M Revan Reddy
| Edited By: |

Updated on: Aug 17, 2026 | 12:44 PM

Share

తెలంగాణలోని  సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన తొమ్మిది మంది విద్యార్థులు ప్రతిరోజూ రఘునాథపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఆరు కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లి చదువుకుంటున్నారు. రవాణా సౌకర్యం లేక కాలి నడకన ప్రతి రోజూ పాఠశాలకు చెందిన వెళ్తున్న విద్యార్థులను గ్రామ సర్పంచ్ గుండా వెంకటరమణ బ్రహ్మారెడ్డి చూసేవారు. ఈ పరిస్థితిని గమనించిన గ్రామ సర్పంచ్ వెంకటరమణ.. విద్యార్థుల నడక కష్టాలకు తెలుసుకొని చలించి పోయారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడకుండా విద్యార్థులకు అండగా నిలవాలని ఆమె భావించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రూ.40వేల విలువైన సైకిళ్లను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా తొమ్మిది మంది విద్యార్థులకు సైకిళ్లు అందించి.. వారి చదువుకు అండగా నిలిచారు. పేద విద్యార్థుల చదువుకు చేయూతనిస్తూ తన సొంత ఖర్చులతో వారికి సైకిళ్లు కొనిచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

పేద కుటుంబాలకు చెందిన పిల్లల చదువుకు అండగా నిలిచి, విద్యార్థుల భవిష్యత్ ను తనకున్న బాధ్యతను చాటుకున్న సర్పంచ్న గ్రామస్థులు, గ్రామ పెద్దలు అభినందించారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మాటకు ఈ సేవ నిదర్శనమని వారు పేర్కొన్నారు. విద్యార్థులపై చూపిన మానవత్వానికి సర్పంచ్ గుండా వెంకటరమణ బ్రహ్మారెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాయం కోసం ఎదురు చూడకుండా.. తన వంతుగా ముందడుగు వేసిన సర్పంచ్..! తొమ్మిది మంది విద్యార్థుల చేతుల్లోకి సైకిళ్లు చేరాయి..వారి కళ్లల్లో మాత్రం కనిపించింది ఒక్కటే.. “ఇక మా చదువుకు దూరం అడ్డంకి కాదు” అనే నమ్మకం..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us