AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ఓటర్లకు ECI గుడ్‌న్యూస్! నోటీసుల గందరగోళం వేళ ప్రత్యేక నమోదు డ్రైవ్!

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతున్న వేళ, ఓటు హక్కు లభించలేదని లేదా పేర్లు గల్లంతయ్యాయని ఆందోళన చెందుతున్న పౌరులకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సమగ్ర సవరణ తర్వాత కూడా మిగిలిపోయిన అర్హులైన ఓటర్లు, యువత, కొత్త ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ ఓటర్లకు ECI గుడ్‌న్యూస్! నోటీసుల గందరగోళం వేళ ప్రత్యేక నమోదు డ్రైవ్!
Telangana Sir 2026
Jyothi Gadda
|

Updated on: Oct 03, 2026 | 6:55 PM

Share

తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా లక్షలాది మంది ఓటర్లకు ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా నోటీసులు జారీ కావడం కలకలం రేపింది. ఈ గందరగోళంపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం (ECI), బల్క్ డిలీషన్లకు చెక్ పెడుతూ ముందస్తు నోటీసులు, విచారణ తప్పనిసరి చేసింది. అంతేకాకుండా, సవరణ ప్రక్రియలో ఓటు హక్కు కోల్పోయిన వారు, అర్హులైన కొత్త ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

2 లక్షల నోటీసుల ఆందోళన:

ప్రస్తుతం జరుగుతున్న సవరణ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 2 లక్షల మందికి పైగా ఓటర్లకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే, అత్యంత విస్తుపోయే విషయమేమిటంటే.. ఆ నోటీసుల్లో అసలు ఏ కారణం చేత నోటీసు ఇచ్చారో పేర్కొనకపోవడం తీవ్ర అయోమయానికి దారితీసింది. కారణం కాలమ్ ఖాళీగా ఉండటంతో ఏ పత్రాలు సమర్పించాలో తెలియక ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బల్క్ డిలీషన్లపై ECI కఠిన నిబంధనలు:

గతంలో వేలాది ఓట్లను ఒకేసారి తొలగించేవారనే ఆరోపణలు ఉండటంతో, ఇకపై ఒకేసారి భారీగా ఓట్లను డిలీట్ చేయడాన్ని నిరోధించేందుకు ECI కఠిన చర్యలు చేపట్టింది.

ఇవి కూడా చదవండి

స్పష్టమైన విచారణ, ఆధారాలు లేకుండా ఏ ఓటరు పేరునూ తొలగించడానికి వీల్లేదు.

ఓటు తొలగించే ముందు సదరు వ్యక్తికి భౌతికంగా లేదా ఎస్ఎమ్‌ఎస్/ఈ-మెయిల్ ద్వారా ముందస్తు నోటీసు ఇవ్వడం తప్పనిసరి.

వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా ఓటు తొలగిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయి.

నవంబర్ 9 తర్వాత ప్రత్యేక డ్రైవ్:

తెలంగాణలో క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం తర్వాత నవంబర్ 9న తుది ఓటర్ల జాబితా (Final Electoral Roll) విడుదల కానుంది. బోగస్ ఓట్లు, డబుల్ ఎంట్రీలను తొలగించడమే దీని ముఖ్య ఉద్దేశం.

తుది జాబితా విడుదలైన వెంటనే SIR ప్రక్రియలో మిగిలిపోయిన ఓటర్లు మరియు 18 ఏళ్లు నిండిన యువత కోసం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభమవుతుంది. ఈ డ్రైవ్‌లో భాగంగా బూత్ లెవల్ అధికారులు (BLOలు) నేరుగా పౌరుల ఇళ్లకు వచ్చి విచారణ జరుపుతారు. అర్హులైన వారి నుంచి నేరుగా ఫారమ్-6 (Form-6) స్వీకరించి ఓటరుగా నమోదు చేస్తారు.

ఓటర్లు చేయాల్సిందేంటి?

నవంబర్ 9న తుది జాబితా రాగానే ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ లేదా ECI వెబ్‌సైట్‌లో మీ పేరు ఉందో లేదో సరిచూసుకోండి. ఒకవేళ పేరు లేకపోయినా ఆందోళన చెందకుండా నవంబర్ 9 తర్వాత మీ ప్రాంతానికి వచ్చే BLO ద్వారా లేదా నేరుగా ఆన్‌లైన్‌లో ఫారమ్-6 సమర్పించి ఓటు హక్కు పొందవచ్చు. ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us