AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒత్తైన, పొడవైన జుట్టు కోసం బియ్యం నీళ్ళు + మెంతుల మ్యాజికల్ కాంబినేషన్!

జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పలుచబడటం వంటి సమస్యలతో బాధపడేవారికి సహజసిద్ధమైన చిట్కాలు ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో, కేశ సంరక్షణ ప్రపంచంలో బియ్యం నీళ్ళు మెంతుల మిశ్రమం బాగా ట్రెండ్ అవుతోంది. కొరియన్ బ్యూటీ సీక్రెట్ అయిన బియ్యం కంజి నీళ్ళు, మన దేశీయ ఆయుర్వేదంలో వాడే మెంతులతో కలవడం వల్ల జుట్టుకు అద్భుతమైన పోషణ లభిస్తుంది. ఈ కాంబినేషన్ ఎందుకు ప్రత్యేకం?

ఒత్తైన, పొడవైన జుట్టు కోసం బియ్యం నీళ్ళు + మెంతుల మ్యాజికల్ కాంబినేషన్!
Rice Water For Hair Growth
Jyothi Gadda
|

Updated on: Oct 03, 2026 | 9:10 AM

Share

జుట్టు సంరక్షణలో బియ్యం నీళ్ళు, మెంతుల మిశ్రమం ఎంతో ప్రజాదరణ పొందుతోంది. కొరియన్ల కేశ సంరక్షణ రహస్యమైన బియ్యం నీటితో మన సాంప్రదాయ మెంతి గింజలు చేరడం వల్ల జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది. ఈ రెండింటినీ నానబెట్టి ఆ నీటిని తలకు స్ప్రే చేయడం వల్ల జుట్టుకు సహజమైన కండిషనింగ్ లభించి, కుదుళ్లు దృఢంగా మారి జుట్టు పొడవుగా పెరుగుతుంది. పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

బియ్యం నీటి ప్రయోజనాలు: బియ్యం నీటిలో విటమిన్ బి, ఇ, అమినో ఆమ్లాలు, ఇనోసిటాల్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి దెబ్బతిన్న జుట్టు కుదుళ్లను పునరుద్ధరించి, జుట్టు విరిగిపోకుండా బలాన్ని అందిస్తాయి.

మెంతుల ప్రయోజనాలు: మెంతులలో ఐరన్, ప్రొటీన్, ఫ్లేవనాయిడ్లు, నికోటినిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తక్షణమే తగ్గించి, తలలో వచ్చే దురద, చుండ్రును శాశ్వతంగా దూరం చేస్తాయి.

ఇవి కూడా చదవండి

తయారు చేసే విధానం: అర కప్పు బియ్యాన్ని తీసుకుని నీటితో శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో కడిగిన బియ్యం, 2 టీస్పూన్ల మెంతులు వేసి, 2 కప్పుల నీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని మాత్రమే వేరు చేసి వడకట్టుకోవాలి. మరింత ఎక్కువ పోషకాల కోసం ఈ నీటిని 24 గంటల పాటు పులియబెట్టి కూడా వాడవచ్చు. ఈ నీటిని ఒక స్ప్రే సీసాలో పోసి ఫ్రిజ్‌లో ఉంచుకోవచ్చు.

ఎలా ఉపయోగించాలి? తలస్నానం చేయడానికి అర గంట ముందు ఈ నీటిని తల కుదుళ్లకు, జుట్టు అంతటికీ బాగా స్ప్రే చేయాలి. ఆ తర్వాత వేలికొనలతో తేలికగా మసాజ్ చేసి, 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి 1 నుండి 2 సార్లు మాత్రమే ఈ పద్ధతిని పాటించడం శ్రేయస్కరం. ఈ సహజ మిశ్రమం జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేసి, కేశాలను మెరిసేలా చేస్తుంది. క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us