AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!

బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!

Phani CH
|

Updated on: Aug 16, 2026 | 5:25 PM

Share

అమెరికాలో పిల్లలను కని పౌరసత్వం పొందేందుకు ప్రయత్నించే విదేశీయులపై ట్రంప్‌ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. బర్త్‌ టూరిజాన్ని అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కేవలం నెల రోజుల్లోనే 600 మందికి పైగా విదేశీయుల వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. నకిలీ పత్రాలు, తప్పుడు శిక్షణ, ప్రయాణ ఏర్పాట్లతో చట్టాలను మోసం చేసే నెట్‌వర్క్‌లపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

అమెరికాలో పిల్లలను కని, ఆ దేశ పౌరసత్వాన్ని అక్రమంగా పొందాలని భావించే విదేశీయులకు అమెరికా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ‘బర్త్ టూరిజం’ పేరుతో సాగుతున్న అక్రమ తంతును అణచివేసేందుకు ట్రంప్ యంత్రాంగం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా కేవలం నెల రోజుల వ్యవధిలోనే 600 మందికి పైగా విదేశీయుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన ప్రకటన చేశారు. అమెరికా పౌరసత్వం అనేది అమ్మకానికి కాదని మార్కో రూబియో స్పష్టం చేశారు. విదేశీయులు అమెరికా చట్టాలను మోసం చేసేలా కొన్ని అక్రమ నెట్‌వర్క్‌లు పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వీసా దరఖాస్తుదారులకు తప్పుడు శిక్షణ ఇవ్వడంతో పాటు, ప్రయాణ ఏర్పాట్లు చేసి, పిల్లలకు అమెరికా పౌరసత్వం వచ్చేలా నకిలీ పత్రాలు సృష్టిస్తున్న ముఠాల ఆటకట్టించేందుకు విదేశాంగ శాఖ ప్రత్యేకంగా ‘బర్త్ టూరిజం ప్రివెన్షన్ టాస్క్‌ఫోర్స్’ను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బృందం నిశితంగా పరిశోధించి కేవలం నెల రోజుల్లోనే వందలాది వీసాలను రద్దు చేసింది. అమెరికా చట్టాల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి, పౌరసత్వ వ్యవస్థ సమగ్రతను కాపాడుకోవడానికి ఈ కఠిన చర్యలు ఎంతో అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులోనూ ఈ బర్త్ టూరిజం నెట్‌వర్క్‌లను పూర్తిగా ఏరిపారేసేందుకు అన్ని రకాల కఠిన చర్యలు తీసుకుంటామని విదేశాంగ శాఖ హెచ్చరించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తుపాకులు వదిలి ర్యాంప్‌పైకి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు..

ఆధార్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు

ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వారి వల్ల కాలేదు.. చివరికి ఇలా..!

ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు!

మీ ఇంట సిరులు కురిపించే మొక్క! ఈ రోజులు, దిశలో నాటాలి గుర్తుంచుకోండి

Follow Us