క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
బీహార్‌కు చెందిన 19 ఏళ్ల శుభం కుమార్ క్యాండీ క్రష్ సాగాలో 22,222వ లెవెల్ పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన శుభం ప్రస్తుతం 23,000వ లెవెల్‌ను కూడా దాటేశాడు. ఈ అసాధారణ విజయానికి నెటిజన్లతో పాటు బీహార్ ప్రభుత్వం కూడా అభినందించింది.
కేవలం సరదా కోసం ఆడే మొబైల్ గేమ్‌తో ఒక యువకుడు ప్రపంచ రికార్డును నెలకొల్పి వార్తల్లో నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పజిల్ గేమ్ క్యాండీ క్రష్ సాగాలో ఏకంగా 22,222వ లెవెల్‌ను విజయవంతంగా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ అరుదైన ఘనత సాధించినందుకుగాను బీహార్‌లోని దిగ్వారా ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల శుభం కుమార్ పేరు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదయింది.శివాన్‌లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న శుభం కుమార్, ఈ ఏడాది జులై 5వ నాటికి క్యాండీ క్రష్ గేమ్‌లో 22,222వ లెవెల్‌ను పూర్తి చేశాడు. ఆ సమయానికి అతని వయసు 19 సంవత్సరాల 8 నెలలు. ఈ అసాధారణ విజయానికి గాను, క్యాండీ క్రష్ సాగాలో అత్యధిక లెవెల్స్ సాధించిన టీనేజర్ విభాగంలో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అతనికి అధికారికంగా రికార్డు ధ్రువీకరణ పత్రం అందజేసింది. రంగురంగుల క్యాండీలను జత చేస్తూ లెవెల్స్ దాటడమే ఈ గేమ్ ప్రధాన అంశం. లెవెల్స్ పెరిగే కొద్దీ ఆట కఠినంగా మారుతున్నప్పటికీ, శుభం కుమార్ ఇక్కడితో ఆగకుండా ప్రస్తుతం 23,000వ లెవెల్‌ను కూడా దాటేసినట్లు ప్రకటించాడు.
మరిన్ని వీడియోల కోసం :
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
నిన్న నాని.. నేడు విజయ్.. ఇది సీరియస్ మ్యాటర్..!
టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న మమితా బైజు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

