AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutton: మటన్ తినే ముందు ఈ నిజాలు తెలుసుకోండి.. లేకపోతే చాలా నష్టపోతారు..

మటన్‌ రుచిని ఇష్టపడేవారు చాలా మందే ఉన్నారు. అయితే మటన్‌ తిన్న వెంటనే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం, వెంటనే నిద్రపోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మటన్‌ తర్వాత తేనె, పాలు, టీ వంటి వాటిని వెంటనే తీసుకోకుండా జాగ్రత్తపడాలని చెబుతున్నారు. అలాగే భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కొద్దిసేపు నడవడం జీర్ణక్రియకు సహాయపడుతుంది.

Mutton: మటన్ తినే ముందు ఈ నిజాలు తెలుసుకోండి.. లేకపోతే చాలా నష్టపోతారు..
Mutton Benefits And Eating Tips
Shaik Madar Saheb
|

Updated on: Aug 17, 2026 | 1:05 PM

Share

మాంసాహారాన్ని ఇష్టపడేవారిలో మటన్ (మేక, పొట్టేలు మాంసం) తింటే వచ్చే రుచే వేరు.. మటన్ ధర కాస్త ఎక్కువైనా, ఎముకల గట్టితనానికి, శరీరానికి బలం చేకూర్చడానికి చాలామంది మటన్‌ను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకుంటారు. మటన్‌లో నాణ్యమైన ప్రోటీన్లు, ఐరన్, జింక్, విటమిన్ బి12, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల మేక మాంసంలో దాదాపు 140 నుండి 200 కేలరీలు, 20 నుండి 25 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్ ఉంటాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. మటన్ రెగ్యులర్ గా తినడం వల్ల.. కండరాల వృద్ధికి, రక్తహీనత నివారణకు, రోగ నిరోధక శక్తికి బాగా సహాయపడుతుంది.

ఇలా మటన్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.. అయితే మటన్ తిన్న వెంటనే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. మటన్ తిన్నాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఏ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఈ కథనంలో సమగ్రంగా తెలుసుకుందాం..

మటన్ తిన్న వెంటనే అస్సలు తినకూడని.. తాగకూడని పదార్థాలు:

తేనె: మటన్ తిన్న వెంటనే లేదా మటన్‌తో పాటు తేనెను తీసుకోకూడదు. దీనివల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా శరీరంలో విపరీతమైన వేడి, స్కిన్ అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉందని ఆయుర్వేద, ఆహార నిపుణులు చెబుతున్నారు.

పాలు – పాల ఉత్పత్తులు: మటన్ తిన్న తర్వాత పాలు, పెరుగు లేదా ఇతర పాల పదార్థాలను తీసుకోవడం అస్సలు మంచిది కాదు. నాన్ వెజ్, పాల ఉత్పత్తులు పరస్పర విరుద్ధమైనవి కావడం వల్ల శరీరంలో జీర్ణ సమస్యలు, చర్మ సంబంధిత అలెర్జీలు వస్తాయి.

టీ: చాలామందికి మటన్ లేదా నాన్-వెజ్ భోజనం చేశాక టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ మటన్ తిన్నాక టీ తాగడం వల్ల కడుపులో యాసిడ్స్ పెరిగిపోయి, జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది శరీరంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది.

మటన్ తిన్నాక నిద్రపోవడం ప్రమాదకరమా?

మటన్ లేదా ఏ నాన్-వెజ్ పదార్థమైనా జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.

మటన్ తిన్న వెంటనే పడుకోవడం వల్ల జీర్ణక్రియ ఆగిపోయి, కడుపు ఉబ్బరం, అజీర్తి, కడుపులో మంట, వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది.

కాబట్టి మటన్ తిన్న వెంటనే నిద్రపోకుండా, కాసేపు అటు ఇటు నడవడం లేదా ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

రుచికరమైన మటన్ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదే అయినప్పటికీ, తిన్న తర్వాత తేనె, పాల ఉత్పత్తులు, టీ వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే భోజనం చేసిన వెంటనే పడుకోకుండా సరైన జీర్ణక్రియ జరిగేలా జాగ్రత్తలు పాటిస్తేనే మటన్ ద్వారా లభించే పూర్తి పోషకాలు శరీరానికి అందుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విషయాల్లో వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు భిన్నంగా ఉండొచ్చని గుర్తుంచుకోవాలి. ఏమైనా సమస్యలుంటే.. ముందుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us